కోవిడ్-19 తో కళ్లముందే కన్న బిడ్డ కన్నుమూత

Nalgonda Covid19 son died infront of her mother: నల్గొండ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 వార్డ్ లో ఆక్సిజన్ అందక మాడుగులపల్లి మండలం సల్కునూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 18-07-20 ఉదయం ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒక్క డాక్టర్ కూడా వచ్చి అతన్ని చూడలేదట . ఆక్సిజన్ లేక ఊపిరి ఆడకపోవడంతో.. సాయంత్రం బెడ్ మీదనే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కన్న బిడ్డ కన్నుమూయడంతో ఆ తల్లి హృదయం తల్లడింది. ఆమె రోదనను చూసి అక్కడున్న వారంతా కన్నీరు మున్నీరు అయ్యారు.
అన్యాయంగా ప్రాణాలు తీశారని.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సుాపరిండెంట్ , డాక్టర్ల పై తగిన చర్యలు తీసుకోవాలని మృతుని బందువులు డిమాండ్ చేస్తున్నారు. అటు.. గత 3 రోజులుగా కోవిడ్ వార్డుకు ఒక్క డాక్టర్ రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇలా అయితే సామాన్య ప్రజలు ఇంకా కోవిడ్-19 బారిన పడితే ఇంకా కాపాడే నాధుడే లేడని అర్ధం చేసుకోవాలి , సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసిన ప్రజలకి సైతం కంటతడి తెప్పిస్తుంది .