Nani complete Villan shades on the way : మరల విలన్ గా మారబోతున్న న్యాచురల్ స్టార్ నాని? :-

Nani complete Villan shades on the way : అవును మీరు చదివింది నిజమే. న్యాచురల్ స్టార్ నాని విలన్ గా అవతారమెత్తబోతున్నారు. ఇదివరకే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి ” వి ” సినిమాలో విలన్ లా కనిపించారు కానీ చివరిలో హీరోగా ప్రోజెక్ట్ చేశారు.
కాకపోతే ఈసారి ఆలా ఉండదు కంప్లీట్ గా విలన్ షేడ్స్ తో నాని అలరించబోతున్నారు.
మ్యాటర్ లోకి వెళ్తే కొద్దీ రోజుల క్రితమే వంశీ పైడిపల్లి దర్శకుడిగా , దిల్ రాజు నిర్మాతగా , తమిళ స్టార్ హీరో విజయ్ హీరో గా ఒక చిత్రం ఉండబోతుందని అధికారిక ప్రకటన జరిగింది. ఈ సినిమా ముహూర్తం అక్టోబర్ 3 వ వారం లో జరగబోతుందని టాక్ నడుస్తుంది.
అయితే వంశి పైడిపల్లి ట్విట్టర్ లో విజయ్ తో సినిమా చేయడం చాల ఆనందంగా ఉంది.ఇద్దరం కలిసి వేరే లెవెల్ లో సినిమా చేయబోతున్నాము అని ఇన్ డైరెక్ట్ గా వంశి చెప్పకనే చెప్పారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో విజయ్ కి సరిసమానమైన విలన్ కోసం చిత్ర బృందం ఎదురు చూడగా , న్యాచురల్ స్టార్ నాని అయితే పర్ఫెక్ట్ అని అనిపించిందట. నాని ” వి ” సినిమాలో విలన్ గా చాల బాగా చేశారని , విజయ్ తో అయితే చాల బాగుంటుంది అని వంశి అనుకున్నారు.
ఇంకా నాని కన్ఫర్మేషన్ ఇయాల్సి ఉంది. నాని కనుకు ఒప్పుకుంటే ఆన్ స్క్రీన్ లో విజయ్ మరియు నాని కలిసి చేసే దండయాత్ర కోసం అభిమానులు ఇప్పటినుంచే ఎదురు చూడటం మొదలుపెడతారు. చూడాలి మరి న్యాచురల్ స్టార్ నాని , వంశి మరియు దిల్ రాజు గారి రిక్వెస్ట్ అంగీకరించి విలన్ గా సిద్ధం అవుతారో లేదో మరి.