Nani Eyes on OTT only : ఓటీటీ బాటలో నడుస్తున్న నాని :-

Nani Eyes on OTT only : కరోనా వళ్ళ సినిమా నిర్మాతలకు ఇబ్బంది మరియు నష్టం కలగకూడదని కొని సినిమాలు ఓటీటీ లో విడుదల చేశారు. అందులో నాని సుధీర్ బాబు నటించిన V సినిమా కూడా ఒకటి.
అయితే ఇపుడు అందరు థియేటర్ లో సినిమా రిలీజ్ చేయాలి అని చిత్ర నిర్మాత మండలి చర్చలు జరుపుతున్న కూడా నాని నటించిన టక్ జగదీశ్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. ఈ విషయం అందరికి తెలిసింది. దీనిపై నాని కూడా స్పందించి ఇందులో నా నిర్ణయం అంటు ఎం లేదు . అంత నిర్మాతల అనుకూలం బట్టే వారి నిర్ణయాన్ని గౌరవిస్తాను అని చెప్పారు.
ఇదిలా ఉండగా నాని నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం అందరికి తెలుసు. అయితే మొట్ట మొదటి సారి నాని చెల్లెలు దీప్తి ఘంటా మీట్ క్యూట్ అనే చిత్రాన్నికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆరుగురు హీరోలు ఆరుగురు హీరోయిన్లు ఉండబోతున్నారు. రోహిణి, ఆదా శర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానిక శర్మ ,సునైనా సంచిత పూనచ , అశ్విన్ కుమార్, శివ కందుకూరి , దీక్షిత్ శెట్టి , గోవింద్ పద్మసూర్య మరియు రాజా ఇలా వీరందరూ ఈ సినిమాలో నటించనున్నారు.
అయితే ఇటీవలే రుహానిక శర్మ తన తదుపరి చిత్రం 101 జిల్లాల అందగాడు విదుదల ప్రొమోషన్స్ భాగంగా ఇంటర్వ్యూ ఇయ్యడం జరిగింది. అయితే అందులో రుహానిక ఈ విధంగా చెపింది ” నా తదుపరి చిత్రం నాని నిర్మిస్తున్న మీట్ క్యూట్ . ఈ సినిమా చాల మటుకు ఓటీటీ కె విడుదల కానుంది ” అని చెప్పకనే చెప్పింది.
కాబట్టి నాని నిర్మిస్తున్న చిత్రం కూడా ఓటీటీ లోనే విదుదల కాబోతుంది అని అర్ధం అయింది. అందరు థియేటర్ లో రిలీజ్ చేయాలి సినిమా బ్రతకాలి అని కోరుకుంటున్నారు అందులో నాని ఒకరు. అలంటి నాని ఇలా ఓటీటీ కి సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కి అమ్మేయడం తన అభిమానులకు నిరుత్సాహ కల్పిస్తుంది. చూడాలి మరి నాని ఎం చేయబోతున్నారో అని.