Tollywood news in telugu

Nani High Voltage Dasara Loading : దసరా కానుకగా న్యాచురల్ స్టార్ నాని దసరా :-

Nani High Voltage Dasara Loading

Nani High Voltage Dasara Loading : న్యాచురల్ స్టార్ నాని గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. చేసే ఏ సినిమా అయినా కథ కొత్తగా మరియు ప్రేక్షకులని అలరించే విధంగా ఉండాలని కోరుకునే హీరో. అలాంటి నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వరుస సినిమాలు సైన్ చేస్తూ , మోస్ట్ బిజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ పూర్తిచేసే దశలో ఉన్నారు. దీని తర్వాత” అంటే సుందరానికి ” అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా దసరా పండుగ కానుకగా నాని 29 వ సినిమాకి సంబందించిన అప్ డేట్ ఇచ్చారు. అదేంటంటే నాని 29 వ సినిమా టైటిల్ గా” దసరా ” అని పోస్టర్ రూపం లో చెప్పారు. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓడేలా అని కొత్త దర్శకుడు పరిచయం అవ్వబోతున్నాడు.

ఈ సినిమాకి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ ద్వారా సుధాకర్ చెరుకూరి గారు నిర్మించబోతున్నారు. పొగ ఇందులో నాని సరసన కీర్తి సురేష్ నటించబోతుంది. వీటన్నింటి మధ్య ఈ సినిమాకి సంబందించిన గ్లింప్సె వీడియో కూడా రిలీజ్ చేసారు.

అందులో నాని కంప్లీట్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారని మరియు ఈ సినిమా మొత్తం గోదావరిఖని లోని సింగరేణి కోల్ మైన్స్ చుట్టూ తిరగబోతుందని చెప్పకనే చెప్పారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. చూడాలి మరి ఈ కొత్త లుక్ లో నాని ఏ రేంజ్ హుంగామ చేయబోతున్నాడో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button