Nani to compete with Bunny : బన్నీ తో పోటాపోటీగా నాని ?:-

Nani to compete with Bunny : అవును ఇండస్ట్రీ అంత ఈ హెడ్డింగ్ మీదే చర్చలు జరుపుతున్నాయి. దీనికి గల కారణం కూడా సడన్ గా నాని సినిమాకి సంబందించిన టీజర్ వదలడం. టీజర్ తో పాటు పోస్టర్ కూడా వదిలారు. ఆ పోస్టర్ ఏ ఇప్పుడు మన హెడ్డింగ్ అస్సలు కారణంగా నిల్చుంది.
మ్యాటర్ లోకి వెళ్తే నాని నటించే సినిమాలలో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ఈ సినిమా దర్శకుడు ఇదివరకు టాక్సీవాలా లాంటి డిఫరెంట్ కంటెంట్ తో వచ్చి హిట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే.
ఇపుడు దసరా కానుకగా విడుదల చేసిన టీజర్ లో నాని డ్యూయల్ షేడ్స్ ని చూపిస్తూ, నాని పాత్రపేరు వాసు అని చెప్పకనే చెప్పారు. ఇందులో మేజర్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవ్వబోతుంది అని అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉండగా నెలరోజుల ముందు నుంచే బన్నీ సుకుమార్ ల ప్యాన్ ఇండియా సినిమా అయినా పుష్ప మొదటి భాగం డిసెంబర్ 17 న విడుదల అవ్వబోతుంది అని చాల సార్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు సడన్ గా నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ లో విడుదల చేస్తారని చెప్పగానే ఈ సినిమా కూడా అదే రోజు అంటే డిసెంబర్ 17 నే విడుదల చేయాలనీ సన్నాహాలు చేశారని చిత్రసీమలో విపరీతంగా టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డిసెంబర్ నెలలో ఎన్నో భారీ సినిమాలు విడుదల చేయాలనీ నిర్ణయించి విడుదల తేదీ కూడా ప్రకటించారు , అందులో వరుణ్ తేజ్ గని , బన్నీ పుష్ప ఇంకా పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఇపుడు నాని సినిమా కూడా డిసెంబర్ అనేసరికి బన్నీ తోనే పోటీపడేందుకు నాని సిద్ధం అయ్యారని తెలుస్తుంది. చూడాలి మరి నాని శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో.