Today Telugu News Updates
నారా లోకేష్ …..మేము ఇంతవరకు చూడని ఒక వేస్ట్ మనిషి !

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి కోడలి నాని నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ కు చేపల చెరువుకు, వరి చేనుకు తేడా తెలియని మనిషని అతనొక ‘వెస్ట్ మనిషని’ మీడియాముందు ఆగ్రహంతో ఊగిపోయారు.
రైతులు కరెంట్ చార్జీలు తగ్గించమని అడుగుతే, బషీర్బాగ్ లో రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుకు కుందని తెలిపాడు. ఇపుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా మాట్లాడటం విచిత్రంగా ఉందని దుయ్యబట్టారు.
గుంటూరు లో జరిగిన ఘటనలో రైతులు పోలీసులపై తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు. ఇలా చేసినందుకు ప్రభుత్వం వారిపై చర్యకూడా తీసుకుంది.
రైతులు ఒక అమరావతిలో మాత్రమే ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడని కోడలి నాని మండి పడ్డారు.