టోవినో థామస్ నారధన్ మూవీ పోస్ట్ పొన్ : Tovino Thomas Naradhan Movie Postponed

అవును జనవరి 27 న విడుదలకు సిద్ధమైన టోవినో థామస్ నారధన్ సినిమా అకస్మాత్తుగా విడుదల తేదీ వాయిదా వేసుకున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేశారు.
టోవినో థామస్ సినిమాలంటే ప్రపంచ వ్యాప్తంగా బాషా రాకపోయినా అందరూ చూస్తారు. దానికి గల కారణం కూడా టోవినో థామస్ యొక్క స్క్రిప్ట్ సెలక్షన్. ఇటీవలే మిన్నల్ మురళి తో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.
గ్యాప్ లేకుండా ఇప్పుడు టోవినో థామస్ నారధన్ అనే సినిమా విడుదలకు సిద్దం చేశారు. ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు. ఇంకో 10 రోజులో విడుదల అని అనుకున్నారు కానీ అనుకోకుండా విడుదల కావడం లేదు అని ఇప్పుడే తెలియజేశారు.
దీనికి గల కారణాలు కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రజలను వణికిస్తున్న ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతు ఉండడం తో చేసేదేం లేక సినిమా విడుదల వాయిదా వేసేశారు. ఈ సినిమా థియేటర్ లో విడుదల అవుతుందో లేదా ఓటీటీ లో వస్తుందో వచ్చి చూడాలి.