neethi kathalu in telugu
1>మంచి ఎవరు చెప్పిన అది పాటించాలి ::
neethi kathalu in telugu : ఒక పండితుని దగ్గర విద్య నేర్చుకున్న ముగ్గురు పండితులు బతుకుదెరువు కోసం అడవి గుండా పట్నానికి బయలుదేరారు వాళ్ళతో పాటు ఒక చదువురాని పని మనిషి కూడా ఉన్నాడు , ఆలా వెళ్తుతు ఉండగా ఒక సింహం కళేబరం చూసి చదువుకున్న వాళ్ళు మాట్లాడుతూ మనకున్న తెలివితో సింహాన్ని బతికించాలి అనుకున్నారు .

Moral stories in telugu
వాళ్ళతో ఉన్న పామరుడు వద్దండి ఆలా చేస్తే సింహం మనల్ని తినేస్తుంది ఆలా చేయొద్దన్నాడు , తన మాట పట్టించుకోకుండా ఆ పండితులు దానికి ప్రాణం పోయసాగారు ఇంతలో పామరుడు భయం తో చెట్టు పైకి ఎక్కేసాడు , ఇక ప్రాణం వచ్చిన సింహం లేచి వెంటనే ఆ పండితులని తినేసింది, ఇక ఆ పామరుడు బాధతో అక్కడినుండి వెళ్ళిపోయాడు
నీతి : మంచి ఎవరు చెప్పిన వినాలి

అనాలోచితం తొందరపాటు పనికిరాదు
Get jobs here….
neethi kathalu in telugu : అనగనగా ఒక ఊరిలో ఒక నక్క తిరుగుతూ రెండు గొర్రెలు పోట్లాడటం చూసింది అలాగే అక్కడ ఉన్న జనాలు కూడా చప్పట్లు కొడుతూ చూస్తూన్నారు , అందుకో ఒక గొర్రెకి బలం గా దెబ్బలు తాకాయి కొమ్ముల మధ్యలోనుండి రక్తం కారాయి అక్కడే ఉన్న నక్కకి రక్తం చూడగానే నోరు ఊరసాగింది వెంటనే ఆ నక్క గొర్రెల పోట్లాడే గొర్రెల మధ్యలో దూరింది వాటి బలమైన కొమ్ములు గుచ్చుకొని అక్కడిక్కడే చనిపోయింది
నీతి : అనాలోచితం తొందరపాటు పనికిరాదు

శత్రువుని అంత గుడ్డిగా నమ్మరాదు
3> neethikathalu in telugu : అనగనగ ఒక కొంగ పులి ఉన్నాయి అవి జన్మతః బద్ధ శత్రువులు , ఒక రోజు పులి ఒక జంతువుని తింటూ ఉండగా ఒక ఎముక నోటిలో ఇరుక్కుపోయింది , అక్కడే ఉన్న కొంగని సహాయం కోరింది , మనం ఇక నుండి మంచి మిత్రులం అని పులి నమ్మబలిగింది , అది నమ్మిన కొంగ తన పొడవైన నోటితో పులినోటిలో ఇరుక్కుపోయిన ఎముకని తీసేసేంది, మరొకరోజు పులికి ఆకలి వేసింది ఆరోజు జంతువులు ఏమి కనబడలేదు, అక్కడే ఉన్న కొంగుని చూసి ఎముక ఇరుక్కుపోయినట్టు నటించింది అది చూసిన కొంగ పులి దగ్గరికి వెళ్ళగానే వెంటనే కోరిక చంపేసింది
నీతి : శత్రువుని అంత గుడ్డిగా నమ్మరాదు
4>రాజు మరియు కోతి సావాసం

పూర్వకాలంలో లో ఒక రాజు ఉండేవారు. అతనికి జంతువుల మీద పక్షుల మీద అపారమైన ప్రేమ స్వభావం ఉండేది. ఒకరోజు తన రాజ్యంలోకి కోతి ని తీసుకొని వచ్చాడు, ఆ కోతి ఎగిరి గంతులువేస్తూ , కనిపించే ప్రతిది తినేది కానీ, రాజు బయటనుంచి రాగానే ఒక రక్షకుడి లా రాజుని కాపాడుతూ ఉండేది . ఇలా కొని రోజులు ఆహ్లాదకరం గా ఆడుతూ పడుతూ గడిచిపోయింది. ఒకానొకరోజు శత్రువులతో యుద్ధం చేసి రాజు రాజ్యానికి వచ్చి కాసేపు ప్రశాంతం గా నిద్రపొదాం అని అనుకొని పడుకున్నారు.
కోతి రాజుగారి నిద్ర కి ఎటువంటి భంగం కలగకుండా చూసుకోవాలని రాజు గారి పక్కనే విసనకర్ర ఊపు తూ కూర్చుంది. కొంత సమయం తర్వాత అక్కడికి ఒక ఈగ రావడం, రాజు నిద్రని భంగం చేయడం కోతి చూసి తట్టుకోలేక పోయింది. కొన్ని సార్లు విసనకర్ర తో ఈగ ని తరిమేయడానికి ప్రయత్నించింది కానీ అది కుదరలేదు ఈగ వెళ్ళినట్టే వెళ్ళి మరలా తిరిగిరావడం కోతి యొక్క సహనానికి పరీక్ష పెటినటైంది. చివరకు ఇలా కాదు అనుకో ని ఒక కత్తి తీసుకొని వచ్చి ఈగ ని చంపేస్తే రాజు సుఖంగా నిద్రపోతాడు అని అనుకోని ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి ఈగ కూర్చున్న ప్రదేశం లో పొడిచేసింది.ఈగ ఎక్కడో కూర్చోలేదు ఈగ కూర్చుంది రాజు గుండెపైన కాబట్టి కోతి పొడిచింది రాజు గారి గుండెలు మీద. తక్షణమే రాజుగారు మరణించారు. ఈగ ఎగిరిపోయింది.
కాబట్టి ఎంత తెలివి గలవారైనా వారి తెలివిని మరియు బుద్ధిని ఉపయోగించక పోతే చివరకు రాజుగారిలాగే మనకు జరుగుతుంది. ఈ కథ లో రాజ్యానికి రాజు అయినా తెలివి ఉపయోగించకపోవడం వల్ల చివరకు తాను పెంచిన కోతి చేతిలోనే చనిపోయాడు.
5)చాకలివాడు , గాడిద మరియు కుక్క

కాశీపురం అనే గ్రామం లో ఒక చాకలివాడు ఉండేవాడు. అతనికి తోడుగా ఒక కుక్క మరియు గాడిద ఉండే వి. ఆ చాకలివాడు ఎంత పిసినారి అంటే తన దగ్గర మూగప్రాణులకు ఇవ్వటానికి ఆహారపదార్ధాలు ఉన్నాకూడా ఇచ్చేవాడు కాదు. అయినా కూడా చాలారోజులు గా కుక్క మరియు గాడిద వెట్టిచాకిరి చేస్తున్నాయి , కానీ వాటికి తినడానికి ఏమి పెట్టెవాడు కాదు. ఒకానొకరోజు చాకలివాడు రోజంతా కష్టపడి బట్టలు ఉతికి అలసిపోయి కాసేపు నిద్రపోదాం అనుకొని విశ్రాంతి తీసుకున్నాడు.
ఇదే సమయం లో అదును చూసుకొని ఒక దొంగ చాకలివాడి ఇంట్లోకి దూరి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. దొంగ రావడం మూగప్రాణాలు రెండు చూశాయి కానీ శబ్దం చేయడము లేదు. గాడిద కుక్క ని అరవమని కోరింది. దానికి కుక్క నేనేందుకు అరవాలి రోజంతా మనము కూడా కష్టపడుతున్నం , కానీ మనకు ఒక పూటైనా భోజనం పెట్టాడా, నేను అరవను అని చెప్పి పక్కకువెల్లింది . కానీ గాడిద ఇలా చేయడం తప్పు నువ్వు అరవకపోతే నేను అరుస్తా అని గాడిద అరవడము మొదలుపెటింది , అప్పుడు చాకలివాడు తన నిద్ర భంగం కలుగుతుందని పక్కనున్న కర్ర తీసుకొని గాడిద మీద కు విసిరి పడుకున్నాడు.
అటు చూస్తే దొంగతనం చేయడానికి వచ్చిన వాడు దర్జాగా దొంగతనం చేసుకొని రాజుల వెళిపోయాడు. ఏ తప్పు చేయకుండానే గాడిద చాకలివాడితో దెబ్బలు తినింది. కాబట్టి ఎవరు చేయవలసిన పనులు వారే చేయాలి లేకపోతే ఇలా గాడిద దెబ్బలు తిన్నట్టే మనం కూడా చిక్కులో పడతాం.
6)కోతి చావు

ఒక గ్రామం లో ప్రజలందరూ కలిసి గుడిని నిర్మించాలనుకొని డబ్బులు పోగుచేసి గుడికి సంబంధించిన పనులు మొదలుపెట్టినారు. వారికి కార్మికుల సహాయం కూడా లభించినది. అందరు కలిసి ఐక్యమత్యంతో పనులు మొదలుపెట్టారు కొని చెట్లను నరికి వాటితో గుడికి కావలసిన స్తంభాలను తయారు చేస్తున్నారు .
అందరు పనిలో నిమగ్నం అయిపోయి సమయం చూసుకోలేదు అందరికి ఆకలివేయ గా ఎక్కడిపనులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ సమయం కోసము చాల సేపటినుంచి కోతులు ఎదురుచూస్తున్నాయి. అందరు వెళ్లిపోగా కోతులు వచ్చి ఆ ప్రదేశం లో ఆడుకోవడం మొదలుపెట్టాయి. కార్మికులు ఒక దుంగ ని రెండు గా చీల్చాలని దుంగ మధ్య లో ఒక పెద్ద ఇనప మేకు ని తగిలించి వెళిపోయారు.
ఒక కోతి ఆ దుంగ కి అటు ఇటు గెంతు తూ ఆనందిస్తుంది. ఆడుతూ ఆడుతూ ఆ కోతి ఆ దుంగ కి కార్మికులు తగిలించిన మేకు ని తీయాలనుకుంది. అలా ప్రయత్నిస్తూవుండగా కోతి యొక్క తోక ఆ మేకు కి దుంగ కి మధ్య లో ఇరుక్కుపోయింది. చాల సేపు కోతి తన ప్రాణాలు రక్షించు కోవడానికి ప్రయత్నించింది కానీ చివరకు చనిపోయినది. కాబట్టి మీకు రానిపనిని చేయకూడదు వచ్చిన పనిని చేతులార పోగొట్టుకొకూడదు.