సినిమా :- Netrikann (2021)

Netrikann (2021) – నటీనటులు:- నయనతార, అజ్మల్, మణికందన్, శరణ్
నిర్మాతలు:- విఘ్నేష్ శివన్, KS మైలవగణన్
డైరెక్టర్ :- మిలింద్ రావు
లాక్ డౌన్ సమయం లో ప్రజలకి ఓటీటీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు నయనతార నటించిన నెత్రికన్ సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.
కథ :-
ఈ కథ దుర్గా (నయనతార) మాజీ పోలీస్ అధికారిగా మరియు ప్రస్తుతం ఒక అంధకారిగా చూపిస్తూ మొదలవుతుంది. అయితే ఒక హిట్ అండ్ రన్ కేసు లో అంధకారి అయినా దుర్గా సాక్షి గా మారుతుంది. ఇదిలా ఉండగా కంటిచూపు లేని దుర్గా సాక్ష్యాని ఎవరు నమ్ముతారు? దుర్గా కి ఆ కేసు కి సంబంధం ఏంటి? చివరికి దుర్గా ఎం చేయబోతుంది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా హాట్ స్టార్ లో చూసేయాల్సిందే.
👍🏻:-
- ఎప్పటిలాగే నయనతార తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని అలరిస్తుంది మరియు మిగితా పాత్రలు సినిమాకి మరింత ప్రాణాన్ని పోశారు.
- కథ బాగుంది .
- దర్శకుడు హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
” సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
*సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
👎🏻:-
- మొదటి 30 నిమిషాలు బోరే.
- అనవసరపు సన్నివేశాలు ఎక్కువున్నాయి.
ముగింపు :-
మొత్తానికి Netrikann అనే సినిమా అనుకున్న స్థాయిలో లేకపోయినా పర్వాలేదనిపిస్తది. నయనతార నటన మరియు యాక్షన్ సన్నివేశాలు చిత్రాన్ని గ్రిప్పింగ్ గా నడిపిస్తాయి మరియు ప్రేక్షకులని అలరిస్తాయి. బోర్ సన్నివేశాలు ఎక్కువ ఉండటం తో విసుగు తెపిస్తుంది. పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడు చుపించాలనుకున్నది చూపించాడు కానీ అనవసరపు సన్నివేశాలు ఎక్కువ పెట్టాడు. మొత్తానికి నెత్రికన్ అనే సినిమా పర్వాలేదు అనిపిస్తది. ఈ వారం కుటుంబం తో కలిసి ఓసారి ఈ సినిమాని చూసేయచ్చు.
Netrikann 2021 Rating:- 2.25/5