సినిమా :- నిశ్శబ్దం (2020) | Nishbdham movie Review

Nishbdham movie Review సినిమా :- నిశ్శబ్దం (2020)
నటీనటులు :- అనుష్క శెట్టి, మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మాడ్సెన్, సుబ్బరాజు
మ్యూజిక్ డైరెక్టర్:- గిరీష్ జి, గోపి సుందర్
నిర్మాతలు :- టిజి విశ్వ ప్రసాద్, కోన వెంకట్
డైరెక్టర్ :- హేమంత్ మధుకర్
కథ:-
ఈ కథ 1970 లో సీటెల్ అనే ప్రదేశం లో మొదలవుతుంది. ఒక ఇంట్లో కొని అనివార్య కారణాల వాళ్ళ ఒక జంట చనిపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ ప్రదేశం లో ప్రతిష్ఠాత్మక పెయింటింగ్ పనిమీద సాక్షి (అనుష్క) మరియు ఆంథోనీ (మాధవన్ ) ఆ ఇంట్లోకి వెళ్తారు. వెళ్లిన కొద్దిరోజులోనే ఆంథోనీ చనిపోతాడు. ఆ సంఘటన నుంచి సాక్షి తప్పించుకుంటుంది. పోలీసులు ఈ కేసు ని విచారించడం మొదలుపెట్టారు. అసలు సాక్షి ఎవరు? ఆంథోనీ గతం ఏంటి? ఆంథోనీ ఎలా చనిపోయాడు ఎవరు చంపారు ? అసలు 1970 లో ని జంట ఎలా చనిపోయింది ? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇవ్వని తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూసేయాల్సిందే.
* మాధవన్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు , అనుష్క మూగమ్మాయిగా కష్టపడింది. అంజలి, షాలిని పండే, సుబ్బరాజు వాలా పాత్రలకి న్యాయం చేసారు.
* దర్శకుడు కథ బాగా రాసుకున్నారు
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
* సినిమాలో ఉన్న కొన్ని లాజిక్స్ అసలు అర్ధం కావు. దర్శకుడు కధనం సరిగా రాసుకోలేకపోయారు.
*చాల అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి కొని సీన్ సాగదీసినట్లు అనిపిస్తుంది.
ముగింపు :-
మొత్తానికి నిశ్శబ్దం అందరు అనుకున్న స్థాయి కి చేరుకోలేకపోయింది అందరి ఆశలు నిరాశ పరిచింది. మాధవన్ మరియు అనుష్క సినిమాలో చాల కష్టపడ్డారు వారికోసం సినిమా ఒకసారి చూసేయచ్చు. అంజలి షాలిని పాండే సుబ్బరాజు తమ పాత్రలని న్యాయం చేసారు. దర్శకుడు కధనం ఇంకా బాగా రాసుకునింటే బాగుండేది. చాల లాజిక్స్ దర్శకుడు వదిలేసారు. కెమెరా పని తీరు బాగుంది. నిర్మాణ విలువలు ఎంతో బాగున్నాయి. మొత్తానికి మీరు ఏమి ఊహించుకోకుండా సినిమా చుస్తే ఎక్కువ బాధ పదారు.. ఎక్కువ ఎక్సపెక్టషన్స్ పెట్టుకొని చుస్తే కచ్చితంగా నిరాశ చెందుతారు.
రేటింగ్ :- 2.5/5