పోలీసుల దాకా చేరిన కీర్తి , నితిన్ ల వ్యవహారం!

keerthi suresh : వెంకీ అట్లూరీ దర్శకత్వం లో , నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లు గా , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం ‘రంగ్‌దే’ . ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలను అందించాడు. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ల స్పీడ్ ని పెంచింది. దీనిలో భాగంగానే నితిన్ ,కీర్తిని ఆట పట్టించే వీడియోలను కూడా ప్రజలతో పంచుకున్నాడు. ఇలాంటి వీడియోలను అర్జున్ వర్సెస్ అను హ్యాష్‌ట్యాగ్‌లతో విడుదల చేస్తున్నారు. ఇపుడు ఈ వీడియోలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి.
ఈ సందర్బంగా తాజాగా నితిన్ షోషల్ మీడియాలో ఒక ఫన్నీ పోస్ట్‌ని పెట్టాడు. కీర్తి సురేష్ స్కూల్లో దిగిన ఒక ఫొటోను షేర్ చేస్తూ…. కనబడుట లేదు. డియర్ అను.. నువ్వు ఎక్కడున్నా రంగ్‌దే ప్రమోషన్లలో పాల్గొనాలని మా కోరిక. ఇట్లు నీ అర్జున్ అని కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ ను చుసిన ప్రేక్షకులు నితిన్ ఇంత చిలిపి పనులు చేస్తాడా అని ఆశ్చర్య పోతున్నారు. ఇక ఇదే పోస్ట్ ని చూసిన హైదరాబాద్ సిటీ పోలీసులు .. . డోన్ట్ వర్రీ వియ్ విల్ టేక్ కేర్ అని కామెంట్ చేసారు. ఇలా పోలీసులు నితిన్ పోస్ట్ కి రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది.

ఇక సినిమా విషయానికి వస్తే… ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రంగ్ దే మూవీ ఉండబోతుంది. మూవీలో నరేష్, రోహిణి, అభినవ్, సుహాస్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ చూస్తూ ఉంటె కీర్తి, నితిన్‌ని చిన్నప్పటి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. మొత్తానికి ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ తో అలరించనుంది అని అర్థమౌతుంది.