No Release of RRR : ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి దారేలేదు :-

No Release of RRR : అందరికి ఎప్పటినుంచో ఈ విషయం గురించి తెలిసిన, అధికారికంగా చిత్ర బృందం ప్రకటించకపోవడం తో అక్టోబర్ లోనే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఉంటుంది అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ అని ఇవ్వాళా చిత్ర బృందం కన్ఫర్మ్ చేసింది. అపుడు చెప్పినట్లే సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అక్టోబర్ 13 న విడుదల అనుకున్నాం, కానీ కొని అనివార్య కారణాల చేత సినిమాని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది.
కొత్త రిలీజ్ డేట్ ఇపుడే అనౌన్స్ చేయలేము. వరల్డ్ వైడ్ గా అన్ని థియేటర్లు తెరుచుకున్నాకనే ఆర్ ఆర్ ఆర్ మీ ముందుకు వస్తుంది అని స్పష్టత ఇచ్చారు చిత్ర బృందం. అయితే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే వరల్డ్ వైడ్ థియేటర్లు అన్ని తెరుచుకోవాలి అని అన్నారు అంటే లాక్ డౌన్ ఉండకూడదు. వరల్డ్ వైడ్ అని థియేటర్స్ లో మార్కెట్ బాగా రన్ అవ్వాలి , బిజినెస్ బాగా జరగాలి అనే ఆలోచనతోనే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ చేసారు అని అర్ధం అయింది.
ఇంకో పక్క ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్స్ రేట్స్ ఇష్యూ నడుస్తూనే ఉంది. దానికి తోడు ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ కి సెపెరేట్ పోర్టల్ పెడతాం అనేసరికి డిస్ట్రిబ్యూటర్స్ కి ఇబ్బంది కలగచ్చు అని ఆపేశారని అనుకోవచు.
ఇలా ఇన్ని సమస్యలతో ఒకవేళ సినిమా రిలీజ్ చేసిన కలెక్షన్స్ లో మాత్రం బాహుబలి ని బీట్ చేయలేదు. అన్ని బాగుండి, అని తెరుచుకొని బిజినెస్ బాగా జరిగే టైం లోనే విడుదల చేస్తే బాహుబలి రికార్డు కొట్టేస్తారు. కాబట్టి ఇప్పట్లో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రాదు. వరల్డ్ వైడ్ బిజినెస్ ఇంతకు ముందులా జరిగినపుడు వస్తది అనుకోవాలి. కాబట్టి అభిమానులు ఆర్ ఆర్ ఆర్ గురించి ఆలోచించు బాధపడకండి.