పాగల్ రివ్యూ – Paagal Movie Review

paagal movie review : నటీనటులు:- విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘ లేఖ, మహేష్ ఆచంట
Direction: నరేష్ కుపిలి
Production: బెక్కం వేణుగోపాల్
Music: రధాన్
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో విశ్వక్ సేన్ నటించిన పాగల్ ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే పాగల్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ :-
ఈ కథ హీరో ప్రేమ్ ( విశ్వక్ సేన్ ) యొక్క బాల్యం లోని విపరీతమైన అమ్మ ప్రేమ గలవాడిగా మొదలవుతుంది. కాలానుసారం హీరో పెద్దవాడయి అమ్మాయిలందరిని ప్రొపొసె చేస్తుంటాడు కానీ అతను కోరుకునే అమ్మాయి మాత్రం దొరకదు. హైదరాబాద్ నుంచి వైజాగ్ కి వెళ్తాడు అక్కడ కూడా ఏ అమ్మాయి తన ప్రపోసల్ అంగీకరించదు. మల్లి హైదరాబాద్ కి వచ్చేస్తాడు , ఇక్కడ అనుకోకుండా పొలిటిషన్ మురళి శర్మ మరియు ప్రేమ్ ల మద్య గే లవ్ ట్రాక్ మొదలవడం తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. అసలు ప్రేమ్ కి ఎలాంటి అమ్మాయి కావాలి? ప్రేమ్ కి ఈ ఆలోచన చిన్నపటినుంచి ఎలా వచ్చింది? ఇవ్వని పక్కన పెడితే అసలు నివేత పెత్తురాజ్ మరియు సిమ్రాన్ చౌదరి లా పాత్రా ఏంటి ? ప్రేమ్ కి మరియు మురళి శర్మ మద్య గే లవ్ ట్రాక్ ఎందుకు వచ్చింది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
👍🏻:-
- విశ్వక్ సేన్ చాల బాగా నటించాడు, పాత్రలో నిమిజ్ఞం అయ్యాడు. నివేత పెత్తురాజ్ మరియు సిమ్రాన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
- కామెడీ ట్రాక్ పర్వాలేదు.
- కథ బాగుంది.
- దర్శకత్వం పర్వాలేదు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
” సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
*సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
👎🏻:-
- కధనం బాలేదు.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
ముగింపు :-
మొత్తానికి పాగల్ అనే చిత్రం అనుకునేంత గొప్ప సినిమా, మూసుకున్న థియేటర్లని తెరిపించే అంత సినిమా అయితే కాదు. తల్లి ప్రేమ అందించే అమ్మాయి కోసం హీరో పడే తపనే సినిమా అంత చూపించారు. లైన్ బాగుంది కానీ ఎగ్జిక్యూట్ సరిగా చేయలేకపోయారు. విశ్వక్ సేన్ తన పాత్రకు బలంగా నిలబడి న్యాయం చేశాడు. నివేత పెత్తురాజ్ మరియు సిమ్రాన్ లు కూడా బాగా చేశారు కానీ ఇక్కడ కధనం సరిగా లేదు. ఫస్ట్ హాఫ్ సో సో గా గడిచిపోగా సెకండ్ హాఫ్ బోర్ గా రొటీన్ మరియు ఎక్స్పెక్టెడ్ సన్నివేశాలతో నడుస్తుంది. మొత్తానికి పాగల్ సినిమా విశ్వక్ సేన్ నటన కోసం ఓసారి వీక్ ఎండ్ లో చూసేయచ్చు.
Rating:- 2.25/5