పిల్లల కోసం పేరెంట్స్ కూడా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు. అవేంటో తెలుసుకోండి?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు ఎక్కువగా రెండేళ్ళ వయస్సు నుండి ఆరుబయట హాయిగా ఆడుకోకుండా ఎప్పుడు మొబైల్, లాప్టాప్స్, టాబ్లెట్స్ ఇప్పుడు ఇవే ప్రపంచంగా మారిపోయాయి. ఎక్కువసేపు స్క్రీన్స్ ముందే టైం గడుపుతున్నారు. కాబట్టి వైద్యులు పిల్లలకు వారి స్మార్ట్ ఫోన్ ఉపయోగం మరియు స్క్రీన్ సమయాలలో కొన్ని లిమిట్స్ అవసరం అని సూచిస్తున్నారు.
అంతే కాకుండా పిల్లలతో పాటుగా తల్లిదండ్రులకు కూడా స్క్రీన్ టైం ఉండాలని పీడియాట్రిక్స్ అడ్వైస్ చేస్తున్నారు.
పిల్లలు ముఖ్యంగా వారి తల్లిదండ్రుల నుండి స్మార్ట్ ఫోన్ అలవాట్లను నేర్చుకుంటారు, కాబట్టి స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటిని unplug చేయడం చాలా అవసరం. పేరెంట్స్ కి ఇప్పుడు ఒకటే సింగల్ టాస్క్ అది తమ పిల్లలతో విలువైన సమయం గడపడం చాలా ముఖ్యం.
“తల్లిదండ్రులకు ఎన్నో పర్సనల్, ఆఫీస్ వర్క్ కోసం ఎల్లప్పుడు స్మార్ట్ ఫోన్స్ మరియు కంప్యూటర్స్ తో ఇంటరాక్టివ్ ని కలిగి ఉంటారు.
పేరెంట్స్ ఎవరైతే ఎక్కువగా వారి మొబైల్ డివైసెస్ తో టైం స్పెండ్ చేస్తుంటారో వారికి పిల్లలకి మధ్య పేరెంట్-చైల్డ్ ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల పోను పోను వారి పిల్లల ప్రవర్తనలో మార్పులు ఎక్కువగా ఉంటాయి.
“అదేవిధంగా, పేరెంట్స్ ఎవరైతే ఎక్కువ సమయం టీవీ చూస్తుంటారో వారి పిల్లలు కూడా ఎక్కువగా టీవీ చూడడానికి అలవాటు పడతారు. దీనివలన తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడే సమయం చాలా తక్కువ, ఆడుకోవడం కూడా ఉండదు.
చాలా మంది వర్కింగ్ పేరెంట్స్ తమ పని ఒత్తిడి నుండి బయటకి రావడానికి ఎక్కువ సేపు మొబైల్స్ తో గడుపుతుంటారు. కాబట్టి పేరెంట్స్ తమ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి మొబైల్స్ కి బదులు చల్లటి గాలిలో వాక్ కి వెళ్లి మంచి శ్వాస తీసుకోవడం మంచిది.
చాలా మంది తమ ఫ్యామిలీ మెంబెర్స్ తో ఉండే సమస్యల నుండి బయటపడ్డానికి, లేదా వారిని అవైడ్ చేయడానికి ఎక్కువ screen time తో గడుపుతుంటారు.
మన ఫ్యామిలీ మెంబెర్స్ లేని టైం లో ఈ-మెయిల్స్ లేదా ఆన్లైన్ సీర్చింగ్ లాంటివి చేసుకుంటే కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం ఉంటుంది.
అదనంగా, తల్లిదండ్రులు భోజన సమయాల్లో, బెడ్ టైం లో మరియు స్పెషల్ డేస్ లో సమయాన్ని కుటుంబ సభ్యులతో అందరు కలిసి గడపడం చాలా ముఖ్యం.
ఎందుకంటే పిల్లలు ప్రతి విషయాన్ని చిన్నప్పటి నుండి వారి తల్లిదండ్రుల బిహేవియర్ చూసి కాపీ చేయడం వలన, పిల్లలు నేర్చుకోకూడని కొన్నింటిని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఫోన్ లో మాట్లాడడం, అసభ్యమైన కంటెంట్ ని పోస్ట్ చేయడం, ఫోన్ మాట్లాడేటప్పుడు పాకన ఉన్న వ్యక్తులని పట్టించుకోకపోవడం వంటివి ముందుగా పేరెంట్స్ చేయకుండా ఉంటే మంచిది.
“తల్లిదండ్రులు ఎక్కువ సమయం screen time తో స్పెండ్ చేయడం వల్ల ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దీని వల్ల పిల్లల భావోద్వేగ మరియు మేధో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
“పేరెంటల్ screen time వల్ల పిల్లలపై తగినంత పర్యవేక్షణ లేకుండా పోతుంది మరియు భద్రతా సమస్యలకు దారితీస్తుంది.
కొద్ది రోజులు ఒక మీ స్మార్ట్ ఫోన్స్ తో గడిపే సమయాన్ని పక్కన పెట్టి మీ పిల్లలతో , ఫ్యామిలీ మెంబెర్స్ తో సమయాన్ని స్పెండ్ చేసి చూడండి. మీలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు.
పేరెంట్స్ తమ పిల్లలకి మొదటి గురువు. గుర్తుంచుకోండి వారికి మంచి ప్రవర్తన నేర్పడం తల్లిదండ్రుల ప్రధమ కర్తవ్యo. పిల్లలకి తల్లిదండ్రులు ఒక రోల్ మోడల్ గా ఉండాలి.