Tollywood news in telugu
ఉదయ్ పుర ప్యాలస్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ !

రేపు జరగనున్న నిహారిక పెళ్ళికి అంత సిద్ధమైంది . బుధవారం రాత్రి 7.15 నిమిషాలకు నిహారిక చైతన్యల పెళ్లి అంగరంగవైభవంగా జరగనుంది.
నిన్నటివరకు పవన్ కళ్యాణ్ పెళ్లి వేడుకలలో లేకపోవడంతో అంతా పవన్ వస్తాడా రాడా అనే సందేహాలు కూడా కలిగాయి. చివరికి ఆ సందేహాలకు సమాధానం ఈ రోజు దొరికింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ చేరుకున్నారు.
పవన్ చేరుకున్న వెంటనే పెళ్లి పనులు ఎంతవరకు అయ్యాయో ఆరా కూడా తీసారు. అన్ని సిద్ధంగా ఉన్నాయో లేదో ప్యాలస్ మొత్తం తిరిగి మరీ పరిశీలించాడు.
పవన్ బాబాయ్ రాకతో నిహారిక కూడా ఆనందంలో మునిగితేలుదట .