Tollywood news in telugu
అప్పట్లో పూరి అనుకున్న పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో క్రేజీ ప్రోజెక్ట్ ఇపుడు పట్టలెక్కనుంది !

ఒక వైపు రాజకీయాలు,మరోవైపు సినిమాలతో బిజిగా ఉన్న పవన్ కళ్యాణ్, మరోసారి పూరితో చేయి కలపనున్నాడని తెలుస్తుంది. వీరి కాంబినేషన్ లో ఇంతకముందు బద్రి, కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలు వచ్చాయి.
పూరి తాను రాసుకున్న కథలో జనగణమన అనేది ఒకటి, ఈ సినిమాకి ముందుగా అనుకున్నది, మహేష్ బాబు ను , కొన్ని కారణాలవల్ల మహేష్ తో కుదరకపోవడంతో,ఇపుడు పవన్ కళ్యాణ్ కి ఆ కథని వినిపించినట్టు సమాచారం.
ప్రజల సంక్షేమం కోరే వ్యక్తితో సినిమా తీస్తే బాగుంటనేది కూడా పూరి ఉద్దేశం. అందుకనే పవన్ కళ్యాణ్ తో ఈ ప్రాజెక్టు చేయాలనీ అనుకుంటున్నాడు.
అన్ని కుదిరితే ఈ జనగణమన సినిమాని పవన్ తో తీసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.