దెబ్బ తాకించుకున్న వర్మ

తెలుగు సినిమా పరిశ్రమలో మొదటి సినిమాతోనే ఉన్నతస్థాయి కి ఎదిగిన దర్శకుడు ఇపుడు బి గ్రేడ్ సినిమాలు తీసుకుంటూ 4 రాళ్ళూ వెనక్కివెసుకుంటున్నాడు. అతనే మన రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే 4 సినిమాలు రిలీజ్ చేసాడు, మరిన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధం చేసాడు. ఈ సినిమాలలో ఆర్ జి వి తీసిన పవర్ స్టార్ సినిమా ఒకటి. ఈ సినిమా మీద ఎంత నెగటివిటి వస్తున్న అస్సలు పటించుకోవడం లేదు. ఎలాగైనా రిలీజ్ చేస్తా అని ట్విట్టర్ లో సవాల్ విసిరాడు. ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మకు ఎన్నడూ ఊహించని విధంగా పెద్ద దెబ్బ తగిలినంతపని అయింది..
ఎవరికీ తెలియకుండా రామ్ గోపాల్ వర్మ మీద పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకరు ‘ పరాన్న జీవి ‘అనే సినిమా తీసేసారు.. ఈ చిత్రానికి సంబంధించి మొదటి పాట ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ పరాన్న జీవి సినిమాని అందరి సహకారం లభిస్తుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. వేచి చూడాలి ఈరోజు సాయంత్రం విడుదలయై పాట రామ్ గోపాల్ వర్మ కి ఎంత గట్టిగా తగులుతుందో.
పవన్ ఫాన్స్ తో పెట్టుకుంటే రివర్స్ గా ఇంత ఫాస్ట్ గా తన పైన సెటైరికల్ సినిమా వస్తుందని ఊహించలేకపోయాడు, మరి ఈ సినిమా వర్మ నీ ఏకేసెలా తియగలరా వేచి చూడాలి