నువు చేసిన పనికి జనాలు అందరూ నీ గురించే మాట్లాడుతున్నారు… అభిజిత్ సొహెల్ తో…

కథ వేరు ఉంటది.. కథ వేరు ఉంటదన్ని సాహిల్ అంటుంటే ఊరికే అనుకున్నాం… కానీ నిజంగానే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కథనే వేరు చేసిండు. బిగ్ బాస్ ఇచ్చిన 25 లక్షల ఆఫర్ ని సోహెల్ సద్వినియోగం చేసుకోవడంతో హోస్ట్ నాగార్జున,మెగాస్టార్ చిరంజీవి చెరో పది లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంటే సోహెల్ 45 లక్షలు సాధించాడు. సోహెల్ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తున్నారు.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో ఈ విషయం పై దుమారం రేగుతుంది.

బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ సోహెల్ 25 లక్షలు తీసుకోవడన్ని క్యాజువల్ గా నే తీసుకున్నా.. కానీ
అభిజిత్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే సోహెల్, అభిజిత్ ఫ్యాన్స్ కి మినీ యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు.
ఈ విషయంపై సోహెల్ స్పందించి.. తనకి అభిజిత్ కి ఎలాంటి గొడవలు లేవు అని..ఈ ఫాన్స్ ఇంత రచ్చ చేయడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఇటీవలే మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ఆ మెహబూబ్ తన యూట్యూబ్ ఛానెల్ కోసం సోహెల్ నీ ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ లో భాగంగా అభిజిత్ కి ఫ్రాంక్ కాల్ చేశారు. ఈ ఫ్రాంక్ కాల్ లో సోహెల్ మొదట తను ఓ డైరెక్టర్ గా పరిచయం చేసుకుంటూ ఆటపట్టు ఇద్దామనుకున్నాడు. కానీ ఇది ముందే గ్రహించిన అభిజిత్ ఎవరో తెలియనట్టు బిహేవ్ చేశాడు.. చివరికి ఏమైనా ఉంటే తన మెయిల్ కి సెండ్ చేయమని సోహెల్ కి ట్విస్ట్ ఇచ్చాడు.. సోహెల్ నన్ను మర్చిపోయావా? అన్ని అడగా.. నిన్ను మరిచిపోతానా? మరిచిపోయే పనులు చేశావా? అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారని అభిజిత్ ఇన్ డైరెక్ట్ గా మెహబూబ్ హింట్ వీడియో పై సెటైర్ వేసినట్టు అనిపించింది