యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే … పర్మిషన్ తీసుకోవాల్సిందే !

యూట్యూబ్ చానల్ క్రియేట్ చేయాలంటే ఇంతకముందు క్షణాల్లో చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ చానల్ ప్రారంభించడం ఇపుడు ఉన్నంత సులభం కాదని తెలుస్తుంది.
ఎందుకంటే ఇక మీదట యూట్యూబ్ చానల్ క్రియేట్ చేయాలంటే కేంద్ర సమాచారశాఖ అనుమతి తప్పని సరి. తాజాగా ఇందుకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది .
ఓటీటీలో పెరిగిపోతున్న అశ్లీలతను నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల సోషల్ మీడియాలో కేంద్రప్రభుత్వంపై ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చట్టాలు లేవు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మీడియా నియంత్రణపై మీ ఉద్దేశం ఏంటని కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పత్రికలు, న్యూస్ చానళ్ల కంటే సోషల్ మీడియాను కట్టడి చేయాలని అత్యున్నత న్యాయ స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇపుడు తాజాగా ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. ఇక మీదట సోషల్ మీడియాలోని వార్తలపై కేంద్ర ప్రభుత్వ నిఘా ఉండనుంది.
ఇందులో భాగంగా యూట్యూబ్ చానల్స్, ఓటీటీ కంటెంట్‌లను సమాచార, ప్రసారశాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.