శ్రీకృష్ణావతారం లో మహేష్ బాబు ….. వైరల్ అవుతున్న ఫోటో !

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పౌరాణికం సినిమాలు చేస్తే అందులో నటించే వ్యక్తి, నందమూరి తారకరామారావు, నాగేశ్వర రావు, సినిమా అయితేనే ప్రజలు ఎగబడి చూసే వారు, ఈ జనరేషన్ వాళ్ళు పౌరాణికం సినిమాలు చూడలంటే బోర్ ఫీలవుతూ ఉంటారు.
కానీ ఇప్పుడు మల్లీ పౌరాణికం రోజులు వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ ‘ఆదిపురుష్ ‘ సినిమాలో రామునిగా నటిస్తున్నాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరష్యాకష్యప్ ‘ మరియు ‘శాకుంతలం ‘ వంటి పౌరాణికాలు వస్తున్నాయి.
ఇదే బాటలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ‘మహా భారతం ‘ ని ఎప్పటికైనా తీస్తా అని అంటున్నాడు.
అలాగే మహేష్ బాబు తాజాగా శ్రీకృష్ణుడిగా నటిస్తే చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు . మహేష్ వీరాభిమాని, మహేష్ బాబు శ్రీకృష్ణుడిగా నటిస్తే ఇలా ఉంటాడు అని ఓ ఫోటోను ఎడిట్ చేసి విడుదల చేసాడు.
ఈ ఫోటో షోషల్ మీడియా ఇపుడు తెగ వైరల్ అవుతుంది.