పోలీస్ కేసులో చిక్కుకున్న సిద్దు : Police Case filed on Actor Siddharth

ఎంటో ఈ మధ్య కాలంలో హీరో సిద్ధార్థ్ గ్రహాఫలం అస్సలు బాలేదు అనుకుంటా. ఏది ముట్టుకున్నా , పట్టుకున్న తీపి కొడుతుంది. సోషల్ మీడియా లో సిద్ధార్థ్ ఎంతో యాక్టివ్ గా ఉంటారు అలాగే తను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తారు. ఇది కొన్ని సార్లు బాగున్నప్పటికీ కొన్ని సార్లు అస్సలు బాగోదు. ఇదే ఇప్పుడు సిద్ధార్థ్ విషయం లో జరిగింది. .
ఇటీవలే సిద్ధార్థ్ , సైనా నెహ్వాల్ మీద ట్విట్టర్ లో కామెంట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని వలన అతనికి ఎంత నెగటివ్ ఫాలోయింగ్ వచ్చిందో చేప్పనక్కర్లేదు. అయితే ఇది సిద్ధార్థ్ గ్రహించి సైనా కు క్షమాపణ లేఖ రాసి , ట్విట్టర్ లో పెట్టగా ఆ క్షమాపణ సైనా అంగీకరించింది. ఇక్కడితో మ్యాటర్ క్లోజ్ అయింది అంటే అస్సలు కాదు.
ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే సిద్ధార్థ్ మీద పోలీస్ కేసు నమోదు అవ్వడం. కానీ కేస్ పెట్టింది సైనా కాదు. సైనా నెహ్వాల్ మీద ఇలాంటి కామెంట్స్ పెట్టినందుకు హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ వింగ్ కు ప్రేరణ అనే మహిళ సిద్ధార్థ్ పైన కేస్ పెట్టింది.
దీనికి పోలీసులు అంగీకరించి ఐపిసి సెక్షన్ 509 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి సంబందించిన కేసులు సిద్ధార్థ్ పైన నమోదు చేసి కేస్ రిజిస్టర్ చేశారని తెలిపారు.
చూడాలి మరి ఇప్పుడు సిద్ధార్థ్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారో.