Tollywood news in telugu

పోలీస్ పటాస్ గొప్ప సినిమా అవుతుంది – నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ

భీమవరం టాకీస్ 97వ సినిమా పోలీస్ పటాస్ ప్రమోషనల్ ట్రైలర్ ఈరోజు (సోమవారం) నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల కావడం జరిగింది.

*ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ…*

నా శిష్యుడు రామసత్యనారాయణ ఇది 97వ సినిమా అంటున్నాడు. కానీ నాకు తెలిసి అతను తన 100వ సినిమాను శతాధిక దర్శకుడితో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా చేసే వరకు తాను 97,98వ సినిమా చేస్తున్నానని అంటాడు. ఏదీ ఏమైనా తాను నిర్మించబోయే అన్నీ సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్న’ అన్నారు.

*నిర్మాత రామసత్యనారాయణ గారు మాట్లాడుతూ..*
నేను సినిమాలు తియ్యడం నేర్చుకుంది సి.కళ్యాణ్ గారి దగ్గరే, పోలీస్ పటాస్ సినిమా అయేషా చక్కగా నటించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడుతుంది. విజయశాంతి తరువాత అంత గొప్ప పేరు సంపాదించుకుంటుంది ఈ అమ్మాయి పోలీస్ పటాస్ అందరికి నచ్చే గొప్ప సినిమా అవుతుంది’ అన్నారు.

*సుధీష్ గారు మాట్లాడుతూ…*

ఒక్క సినిమా ప్లాప్ అయితే నిర్మాతలు కనుమరుగవుతారు, కానీ నిర్మాత రామసత్యనారాయణ గారు క్వాలీటితో కూడిన ఇన్ని సినిమాలు వరుసగా అందిస్తూ చక్కటి చిరునవ్వుతో ఉన్నారు చాలా సంతోషం’అన్నారు

*మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ…*

కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన అయేషా ఈ సినిమాలో నటించడం విశేషం. రామసత్యనారాయణ మంచి చిత్రాలు నిర్మిస్తూ చిన్న నిర్మాతలకు రోల్ మెడల్ ఉన్నారు’అన్నారు.

*నటీనటులు*
అయేషా, రవికాలే, నిరంజన్ తదితరులు

*సాంకేతిక నిపుణులు*
సంగీతం: శ్రీ వాస్తవ్
కథ: నాగేశ్వర రావు
పి.ఆర్.ఓ: వీసా మధు
సాహిత్యం: బాల త్రిపుర సుందరి
నిర్మాత: రామసత్యనారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button