Today Telugu News Updates
Dubbaka By-election 2020 : దుబ్బాక లో స్టార్ట్ ఐన పోలింగ్ పండగ !
telangana bypolls : మొన్నటివరకు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వారి ప్రచారాన్ని జోరుగా సాగించాయి. ప్రచార జోరుకు తగ్గట్టు ఓటర్లు కూడా ఓటు వేయడానికి పోలింగ్ కేద్రానికి తరలి వస్తున్నారు.

నియోజకవర్గంలోని ముసలి వాళ్ళు, యువత ఎంతో ఆసక్తిగా ఓటు వేసి వెళ్తున్నారు. కరోనా బాధితులు ఓటేసేందుకు ప్రత్యేక సమయం ఏర్పాటు చేసారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది.

ఉదయం 9 గంటల వరకు 12. 70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ విషయం లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసారు.

ఈ నెల 10న ఓట్లు లెక్కించి ఫలితాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.