poly pharmacy side effects in telugu
poly pharmacy side effects in telugu
దేశంలోని అనేకమంది ప్రజలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు. వీటన్నింటి కోసం ప్రతి రోజూ నాలుగు లేదా అయిదు టాబ్లెట్స్ ని కలిపి ఒకేసారి వేసుకుంటూ ఉంటారు. వారికి ఉన్న వ్యాధే ఒక పెద్ద సమస్య అయితే, వారు తమకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కలిపి వేసుకునే మందులు అన్ని కలిపి ఒకేసారి తీసుకోవడం వల్ల అవి ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి మరియు సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగిస్తాయి. ఇది హెల్త్ ని మరింత పాడు చేస్తుంది.
అంటే ఒక వ్యక్తి ఒక రోజులో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ప్రిస్క్రిప్షన్ మందులు తీసుకోవడంని వైద్యపరంగా “poly pharmacy” అని అంటారు. ఒక మెడిసిన్ అనేది వివిధ ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేయడంలో సహాయపడగలదు, అయితే ఎక్కువ మొత్తంలో మందులన్నీ కలిపి ఒకేసారి వేసుకుంటే వాటి వల్ల మనకు జరిగే మంచి కంటే అవి మరింత హానిని కలిగించవచ్చు. పాలి ఫార్మసీ అనేది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మధుమేహం, కీళ్ళనొప్పులు, రక్తపోటుకి మందులు వాడే వారు వాటితో పాటు నొప్పులు, జ్వరం మరియు జీర్ణ సమస్యలకు తక్షణ నివారణ కోసం కూడా మందులను తీసుకుంటూ ఉంటారు.
కానీ పేషెంట్స్ కి ఎక్కువ సంఖ్యలో మందులు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్స్ సాధారణ జలుబు వంటి వాటి కోసం మందులను తీసుకున్నప్పుడు వారు ముందుగానే కంటిన్యూ చేస్తున్న మేడికేషన్ తో రియాక్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుందని వారికి తెలియదు.
కొన్నిసార్లు మందులు కూడా ఒక మెడిసిన్ మరొక మెడిసిన్ సామర్ధ్యాన్ని పెంచుతాయి లేదా తగ్గించవచ్చు. ఒక ఔషధం ఇతర ఔషధం పనితీరుతో జోక్యం చేసుకోవచ్చు మరియు అవి ఎఫెక్ట్ గా ఉండే సమయాన్ని తగ్గిస్తుంది మరియు వైస్ వెర్సా.
poly pharmacy ప్రమాదాన్ని తగ్గించడానికి రోగులు ఈ కింద చెప్పిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది:
మీ హెల్త్ కండిషన్స్ ని తెలుసుకోండి:
ప్రతి వ్యక్తి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అనేక ఆరోగ్య సమస్యలు ఉంటే, ఒక చిన్న నోట్ బుక్ లో వాటి గురించి నోట్ చేసుకుంటే ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది.
ఒక సెంట్రల్ ఫిజిషియన్ ని ప్రయత్నించండి:
ఈ డాక్టర్ అన్ని మందులను పర్యవేక్షించేందుకు, సమగ్ర సలహా అందించడానికి మరియు అవసరమైతే కూడా నిర్దిష్ట వైద్యులు మరియు నిపుణులను కలవమని సలహా ఇస్తుంటారు.
తీసుకునే అన్ని మందుల గురించి తెలుసుకోవాలి:
పేషెంట్స్ కేవలం డాక్టర్ ఇచ్చిన మందులను వేసుకోవడం కాకుండా డాక్టర్ చెకప్ కి వెళ్ళినప్పుడు ఆ మందులను ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా అని అడగాలి.. ఏదైనా ఒక కొత్త కండిషన్ ఏర్పడినప్పుడల్లా, డాక్టర్ మనం తప్పక తీసుకోవాల్సిన అన్ని మందులు గురించి చెప్తారు.
మీ వైద్యుడిని ప్రతిదాని గురించి అడగండి:
సూచించిన మెడిసిన్స్ గురించి వైద్యుడిని అడగండి, వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు మరియు జరిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలి.
డైట్ గురించి చర్చించండి:
కొన్ని ఆహారపదార్ధాలు మరియు సప్లిమెంట్స్ వినియోగంతో తరచుగా మందులు రియాక్షన్ చూపిస్తాయి. అందువలన, డాక్టర్ ని తప్పనిసరిగా ఆహారపదార్థాలు గురించి అడిగి తెలుసుకోవాలి, తద్వారా మనం తీసుకొనే డ్రగ్స్ మరియు వాటి మోతాదులను గురించి తెలుసుకోవాలి.
సూచనలను అనుసరించండి:
చాలామంది తాము వాడే మెడిసిన్స్ ని వైద్యులు చెప్పిన టైమింగ్స్ మరియు డోసేజ్ ప్రకారం వేసుకోరు. కొంచెం బెటర్ గా ఫీల్ అయిన వెంటనే మెడిసిన్ తీసుకోవడం ఆపివేస్తుoటారు. అది కరెక్ట్ కాదు. డాక్టర్ ఇచ్చిన సూచనలను తప్పక పాటించాలి.
అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని గమనించండి:
ఎంత చిన్న సైడ్ ఎఫెక్ట్ అయినప్పటికీ, ప్రతి దానిని గుర్తించి ఆ మెడిసిన్ వల్ల దీర్ఘకాలిక దుష్ఫలితాన్ని కలిగించకుండా చూసుకోవాలి.
సిమిలర్ డ్రగ్స్:
సీనియర్ సిటిజెన్స్ చూడడానికి ఒకే కలర్ లో, వినడానికి ఒకేలా ఉండే పేరున్న మెడిసిన్స్ విషయంలో మరింత అలర్ట్ గా ఉండాలి. చాలా తరచుగా, ఇటువంటి సిమిలర్ డ్రగ్స్ ని వేసుకోవడం వల్ల అవి శరీరంలో స్ట్రెస్ ని కలిగిస్తాయి.
కాబట్టి poly pharmacy విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Very shortly this web site will be famous amid all blogging and site-building
people, due to it’s nice content http://keo365.com/the-thao