Poonam Kaur: ఒక దళితుని మరణం , హత్య రాజకీయాలు అంటూ ట్వీట్ చేసిన ప్రముఖ నటి

Poonam Kaur about kathi mahesh: ఒక దళితుని మరణం , హత్య రాజకీయాలు అంటూ ట్వీట్ చేసిన ప్రముఖ నటి
మనందరికీ తెలుసు కత్తి మహేష్ ఎవరో , అయన ఎం చేసేవారో, ఎలా పైకి వచ్చారో అని దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. అయితే రెండు వారాల క్రితం యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య పోరాడిన కత్తి మహేష్ శనివారం రాత్రి చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు నెటిజన్లు రకరకాలుగా సోషల్ మీడియా లో కామెంట్లు చేస్తున్నారు. అయన మరణ వార్త కొందరికి బాధ కలిగిస్తే, మరికొందరికి ఆనందాన్ని, నవ్వులని కలిగిస్తుంది. చూసారా కాలం ఎంత విచిత్రమైనదో ఎంతటి శత్రువు అయినా ఇంటికి వస్తే నీళ్లు ఇచ్చి పంపించాలి అనే సామెత తో పెరిగిన మనము ఒకరి చావు చూసి నవ్వగలుగుతాం అంటే మనుషులు ఎలా మారిపోతున్నారో గమనించాల్సిన విషయమే.
ఇక రాజకీయాల్లో కత్తి మహేష్ చేసిన పనులు అందరు చూసిందే. కత్తి మహేష్ కి మరియు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కి అసలు పడదు. ఎన్నో ట్వీట్లు చూసాము కత్తి మహేష్ జనసేన పార్టీ ని మరియు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేసారో దాని పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోయిన పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వారిలో సాధారణ మనుషులు ఉన్నారు , సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అందులో నటి పూనమ్ కౌర్ ఒకరు.
గతం లో కతిమహేష్ మరియు పూనమ్ కౌర్ మధ్య ట్వీట్ల యుద్ధమే జరిగింది. కత్తి మహేష్ కి ఆక్సిడెంట్ అయినా రోజు కూడా పూనమ్ కౌర్ ” రాముడిని సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్ వదిలేశావ్. ఏళ్ల నుంచి పద్దతిగా నా పని నేను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ ” అని ట్వీట్ వేశారు.
అలంటి వారు ఇపుడు కత్తి మహేష్ మరణించిన వార్త తెలుసుకున్నాక కత్తి మహేష్ అనే పదం ఉపయోగించకుండా పరోక్షంగా ట్వీట్ చేసారు అదేంటంటే , ” నా తప్పు లేకపోయినా.. నేను ప్రతీ రోజు చస్తూ బ్రతికాను. నా మనస్సులో ఇప్పుడు అనిపిస్తుంది.. ఇన్ని రోజులుగా నాకు ఇలా ఎందుకు జరిగిందని.. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒక రాజకీయ పార్టీ తమ పరువు కోసం బలవంతంగా ఒక దళితుడిని.. పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. ఇక ఆ పేరును మళ్లీ ప్రస్థావించను? ” అని పెట్టడం అందరిని ఆలోచించేలా చేసింది.
ఏదైనా ఒకరి మరణాని చూసి మనం ఆనందించాల్సిన రోజు ఎప్పటికి రాకూడదు అని కోరుకుంటున్నాము. కత్తి మహేష్ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము.