Tollywood news in telugu
రాజశేఖర్ కల్కీ టీజర్ అదుర్స్
నూతన సంవత్సర కానుక గా రాజశేఖర్ నూతన సినిమా మోషన్ టీజర్ విడుదల.
గరుడ వేగతో ప్రస్తుతము సక్సెస్ లో ఉన్నటువంటి రాజశేఖర్ ఈరోజు నూతన సంవత్సరం వేళ తన కొత్త సినిమా కల్కి కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఈరోజు ట్విట్టర్ వేదిక గా తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేశారు.
ఇందులో తను ఒక సినియర్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఆదాశర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం ప్రవీణ్ వర్మ. 1983లోని ఒక ఇన్వెస్టిగేషన్ ఆధారంగా కథ రూపొందించబడింది అని తెలుస్తుంది. ఏదేమైనా రాజశేఖర్ ఇదివరలో పోలీస్ అధికారిగా నటించిన చిత్రాలు అన్ని సక్సెస్ కాబట్టి ఈ చిత్రం కూడా భారీ విజయం సాధిస్తుంది అని టీజర్ కు సోషల్ మీడియా లో వస్తున్న రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది.