movie reviews

అదిరింది పేటా సినిమా

సంక్రాంతికి వచ్చిన రజనీకాంత్ పేటా మీద టాక్ ఎలా ఉందో తెలుసా?

రజనీకాంత్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న హీరో.మొన్నీమధ్య రోబో 2.0తో హిట్ కొట్టిన రజనీకాంత్ సంక్రాంతికి మన ముందుకు మరో చిత్రంతో వచ్చారు.నేడు ప్రపంచ వ్యాప్తంగ కార్తీక్ సుబ్బరాజు డైరెక్టరు గా అనిరుధ్ సంగీతమ్ అందించిన పేటా రిలీజ్ అయింది.అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్ లు తక్కువ దొరకడం వల్ల ఇటు అభిమానులకు అటు బయ్యర్లకు ఇబ్బంది ఉన్నా కూడా విదేశాల్లో రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకు పోతుంది.

సినిమా చూసిన వారంతా రెండు దశాబ్దాల కింద సినిమా చూసినట్టు ఫీల్ అయ్యారుట.బాషాను మించిన మాస్ ఎంటర్టెయిన్మెంట్ కథ అని చెప్పవచ్చు.హాస్టల్ వార్డెన్ గా ఆయన నటన కామెడి టైమింగ్ అద్భుతం అంటున్నారు ప్రేక్షకులు.ఇంటర్ వెల్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్.సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కు చాలా ప్లస్.రజనీ ని యంగ్ గా చూపించారు దర్శకులు అంటున్నారు ప్రేక్షకులు.త్రిషా రజనీ,సిమ్రాన్ ఎవరికి వారే పోటీ పడిమరి నటించారు అని సగటు అభిమానుల అభిప్రాయం.క్రిటిక్స్ కూడా సినిమాకు ఎబో 3.5రేటింగ్ ఇవ్వడం గమనార్హం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button