అనసూయ నటించిన ‘థాంక్యూ బ్రదర్ ‘ సినిమా పోస్టర్ లాంచ్ !

Anasuya Bharadwaj: కోవిడ్ ఈ మధ్యకాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీని ప్రపంచ ఆర్థిక వ్యవ్థను, తీవ్రంగా దెబ్బతీసింది. అయితే కళాకారుల ఉన్న తపనను దెబ్బతీయలేకపోయింది. కరోనా కాలానికి సంబంధించిన ఘటనలను ఆధారంగా చేసుకొని క్రియేటివ్ జీనియస్ రమేష్ రాపర్తి ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టైటిల్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతుంది .
ఆ పోస్టర్‌లో ఓ లిఫ్ట్, దాని ఎదురుగా ఫ్లోర్ మీద పడి ఉన్న మాస్క్ కనిపిస్తుంది .ఈ పోస్టర్ ని దగ్గుబాటి రానా తన ట్విట్టర్లో రిలీజ్ చేసాడు. ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ మెయిన్ పాత్రలో నటిస్తున్నారు. శ్విన్ విరాజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మాగుంట శరత్‌చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరిడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని . పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని సినీవర్గాలు తెలిపాయి .