Tollywood news in telugu

Postpone of newly announced films : విడుదల వాయిదా వేసుకుంటున్న కొత్త సినిమాలు:-

Postpone of Newly Announced Films : కరోనా 2 వ దశ ముగించాక టాలీవుడ్ లో ఎప్పటినుంచో విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాలు ఇపుడు మళ్ళీ కొత్త రిలీజ్ డేట్స్ తో మన ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

ముందుగా సెప్టెంబర్ 3 న గోపీచంద్ నటించిన సీటిమార్ విడుదల అని ఇన్నిరోజులు ప్రకటించారు. ఇపుడు మళ్ళీ విడుదల వాయిదా వేసుకొని సెప్టెంబర్ 10 న అని , వినాయక చవితి కానుకగా అని అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 10 న వినాయక చవితి కానుకగా విడుదల అవ్వాల్సిన నాగ చైతన్య లవ్ స్టోరీ పోస్ట్ పోన్ చేసేశారు. కొత్త విడుదల తేదిని మళ్ళి ప్రకటించాల్సి ఉంది.

ఇదంతా టక్ జగదీష్ థియేటర్ రిలీజ్ కాకుండా ఓటీటీ రిలీజ్ చేయడం వల్లే వాయిదా వేస్తున్నారని అర్ధం అవుతుంది.

మొత్తానికి ఈ వినాయక చవితికి ఓటీటీ రూపంలో నాని టక్ జగదీష్ రాగ , గోపీచంద్ సంపత్ నంది లా సీటిమార్ థియేటర్ రిలీజ్ అవడం ఖరారు చేశారు. చూడాలి మరి ఇంకెన్ని సినిమాల తేదీలు వాయిదా పడుతాయో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button