Power Star Pawan Kalyan Reporting on time : పవర్ స్టార్ మ్యానియా షురూ :-

Power Star Pawan Kalyan Reporting on time : దీపావళి కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు రానా నటించిన భీమ్లా నాయక్ చిత్రబృందం నుంచి 40 సెకండ్స్ వీడియో రిలీజ్ చేయగా పవర్ స్టార్ మ్యానియా భీభత్సమ్ సృష్టిస్తుంది అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు.
వీడియో లో పవన్ కళ్యాణ్ గారి స్టైల్ , డైలాగ్స్ , మ్యానరిజం అభిమానులకు జాతర వాతావరం సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ , రోడ్ మధ్యలో కూర్చొని చాక్లేట్ ఇస్తూ డైలాగు చెప్పడం , కార్ గాల్లో లేవడం , రానా భయపడుతూ నిలబడటం అబ్బో ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనే చెప్పాలి.
దానికితోడు కళ్యాణ్ గారు హ్యాపీ దీపావళి విషెస్ కూడా వీడియో లోనే చెప్పేయడం చాల ఆనందానికి గురిచేసింది. అయితే ఈ సౌండ్ అఫ్ భీమ్లా సాంగ్ నవంబర్ 7 న విడుదల చేయబోతున్నారు. 40 సెకండ్ల విడియోతోనే హైప్ తెచ్చిన సాంగ్ , ఇంకా పూర్తి సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మరి.
ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా వెనకడుగు వెయ్యకుండా కచ్చితంగా విడుదల చేస్తున్నారని మరల గుచ్చి గుచ్చి చెప్పారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న భీమ్లా నాయక్ రిపోర్టింగ్ చేయబోతున్నడనే విషయం లో ఎటువంటి సందేహం లేదు.
ఆల్రెడీ ప్రొమోషన్స్ గ్రాండ్ గా మొదలుపెట్టారు. చూడాలి మరి సౌండ్ అఫ్ భీమ్లా నాయక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మరియు ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ లో చేంజెస్ ఎలా చేశారో త్వరలో చూడబోతున్నాం. ఆర్.ఆర్.ఆర్ మరియు రాధేశ్యామ్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు భీమ్లా నాయక్ సర్వం సిద్ధం అయింది.