Prabhas 25th Film with Dil Raju : ప్రభాస్ 25 వ సినిమా టైటిల్ గా వృందావన :-

Prabhas 25th Film with Dil Raju : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరల్డ్ వైడ్ ఫేమస్ స్టార్ అయ్యారు , అప్పటినుంచి తీసే ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లోనే ఉండేలా చూసుకుంటున్నారు. బాహుబలే తర్వాత వచ్చిన సాహో ప్లాప్ టాక్ వచ్చిన కలెక్షన్స్ లో మాత్రం ప్రభాస్ బాహుబలే అనిపించుకున్నాడు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే సాహో ప్రభాస్ 19 వ సినిమా అవ్వడం తో తదుపరి సినిమాల పేర్లు వరుసబెట్టి అనౌన్స్ చేశారు. అందులో ప్రభాస్ 20 రాధే శ్యామ్ జనవరి 2022 లో రిలీజ్ కి సిద్ధమవగా , ప్రభాస్ 21 గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్ 2022 సమ్మర్ కి సిద్ధమైంది. ప్రభాస్ 22 గా హిందీ లో ఓం రావట్ దర్శకత్వం లో ఆదిపురుష్ అనే హిస్టారికల్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని 2022 అక్టోబర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్ 23 గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సైంటిఫిక్ సినిమా ముహూర్తం కూడా పెటేశారు. ఈ సినిమాని 2023 లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ 24 గా మరో హిందీ డైరెక్టర్ తో ఉండబోగా ప్రభాస్ 25 మన తెలుగు నిర్మాత అయినా దిల్ రాజు బ్యానర్ లో చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకి టైటిల్ గా వృందావన అని కూడా ఛాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు తెలుసుతుంది.
ప్రభాస్ 25 వ సినిమాని దిల్ రాజు ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. వృందావన కూడా హిస్టారికల్ సినిమా గా చిత్రీకరించనున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు.