Tollywood news in telugu

ఇండియా వైడ్ ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు – ప్రభాస్.

సాహో’ సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రచారంలో భాగంగా తొలి మీడియా సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ పాల్గొన్నారు.

మొత్తంగా గ్రేట్ ఫీలింగ్ అయ్యాయన్నారు. ఆయన నటించిన చిత్రం సాహో ఆగస్టు 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. 2019, ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్దా కపూర్, ప్రొడ్యూసర్స్ పాల్గొన్నారు.

సినిమాకు సంబంధించిన విశేషాలను వారు తెలియచేశారు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా అవుతుందని అనుకున్నా..క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని..అందుకే బడ్జెట్ పెరిగిందన్నారు. ఇండియా వైడ్ ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదన్నారు ప్రభాస్. బాహుబలి రిజల్ట్ తర్వాత..దాని ప్రభావం దానిపై పడిందన్నారు. సినిమా చూసిన తర్వాత ట్రైలర్ కట్ చేయడం ఎంత కష్టమో మీకే తెలుస్తుందన్నారు. ఒకే ఒక్క సీన్ ఐదారుసార్లు వస్తుందని..ఇది చాలా డిఫికల్ట్ సీన్ అని తెలిపారు. ఈ సీన్ చేయడంలో సుజిత్ సక్సెస్ అయ్యాడని..అందుకే నమ్మకం కలిగిందన్నారు. సాహోలో నటించడం ఆనందంగా ఉందన్నారు శ్రద్ధా. స్టోరీ విన్న తరువాత గొప్ప పాత్ర లభించిందనే ఆనందం కలిగిందన్నారు. ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

ఇక చిత్ర విషయానికి వస్తే…సాహో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన పోస్టర్స్, చిన్నపాటి టీజర్స్ విడుదల చేస్తూ అభిమానుల్లో హైప్ పెంచారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భార స్పందన వ్యక్తమౌతోంది. సాహో అంటూ కితాబిచ్చేస్తున్నారు. ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. హాలీవుడ్ మించి సినిమా తీశారని మెచ్చుకుంటున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా. ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించగా నీల్ నితిన్ ముఖేశ్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, మహేశ్ మంజ్రేకర్‌లు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ప్రెస్టీజియస్ ఫిలిం.. సాహో ఆగస్టు 30న తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button