Tollywood news in telugu

Prabhas fans highly disappointed : ప్రభాస్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త ? :-

Prabhas fans highly disappointed

Prabhas fans highly disappointed : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , ప్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకొని భారీ లెవెల్ లో సినిమాలు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ల్యాండ్ మార్క్ సినిమా అదేనండి ప్రభాస్ 25 వ సినిమా కి సంబందించిన అధికారికంగా ప్రకటన జరిపిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.

ప్రభాస్ 25 వ సినిమా కల్ట్ డైరెక్టర్ అయినా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు అని , ఈ సినిమా టైటిల్ గా స్పిరిట్ అని , ఈ సినిమాలో ప్రభాస్ నెవెర్ బిఫోర్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందని అందరికి అనౌన్స్ చేసిన రోజు చెప్పకనే చెప్పారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏ ముద్దుగుమ్మ ఉండబోతుందో , అస్సలే ప్రభాస్ 25 వ సినిమా మొట్టమొదటి సారి టాలీవుడ్ సినిమా చరిత్ర లో ఎవరు రిలీజ్ చేయని విధంగా ప్లాన్ చేసింది. అదేంటంటే ఈ సినిమా 8 భాషలో మరియు చైనీస్ , జపనీస్ , థాయ్ భాషలో విడుదల అవ్వబోతుంది. ఇలా ఇంతవరకు ఏ తెలుగు సినిమాకి జరగలేదు.

ఇలా అంత భారీ లెవెల్ లో ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఇన్ని వార్తలు విన్న ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దే లేదు.

ఇపుడు అసలైన మ్యాటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో ప్రభాస్ సరసన కరీనా కపూర్ నటించబోతుంది చిత్రసీమ లో టాక్ విపరీతంగా నడుస్తుంది. సోషల్ మీడియా అంత కరీనా కపూర్ ఏ హీరోయిన్ గా ఈ సినిమాలో కనిపించబోతుంది అని డిస్కషన్స్ జరుపుతున్నాయి. ఇంకా ఈ విషయం పై చిత్రబృందం అధికారిక ప్రకటన జరపలేదు.

త్వరలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ సినిమాలో హీరోయిన్ ని వెల్లడించబోతున్నారని టాక్ నడుస్తుంది. దాని కారణంగానే ప్రభాస్ సరసన కరీనా కపూర్ నటించబోతుందని అని టాక్ లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఈ వార్త విన్న అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఏదేమైనా ఈ వార్త నిజం కాకపోతే బాగుంటుందని అందరు అనుకుంటున్నారు. చూడాలి మరి దీనిపై చిత్రబృందం ఏ విధంగా స్పందించబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button