దీపావళి నాటి విధి విధానం
దీపావళి నాడు ఉదయం 5 గంటలలోపే అభ్యంగనస్నానం పూర్తిచేయాలి. దీన్ని స్వాత్యభ్యంగం అంటారు.. అంటే స్వాతి నక్షత్రం వెళ్లిపోయేలోపు చేసే స్నానం.ఒంటికి నువ్వుల నూనె అలదుకుని చేయాల్సిన స్నానం అనంతరం మధ్యాహ్నం పూట పితృదేవతారాధన చేయాలి. ఇక, దీపావళి రోజు లక్ష్మీదేవిని విధిగా పూజించాలి. సంపద, శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీని పూజించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే, సాయంత్రం సమయంలోనే పూజ చేయాలి.కొంతమంది అర్ద రాత్రి కూడా చేస్తారు. అదే అమ్మవారు వచ్చే సమయం గా, ప్రతి పూజలోనూ వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని వినాయకుడిని కలిపి పూజిస్తారు. లక్ష్మీదేవి పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని పూజిస్తారు. దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి.
లక్ష్మి ప్రతి రూపాలు అయిన నాణేలను పళ్ళెం లో పోసి , ఇంకా ధనవంతులు అయితే కరెన్సీ నోట్లు , బంగారం , వెండిని అమ్మవారి ముందు ఉంచి యధాశక్తిగా స్తుతి స్తోత్ర పారాయణ లతో లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత అలక్ష్మీ నిస్సరణం అంటే.. లక్ష్మీప్రదం కాని వస్తువులను దీపానికి చూపిస్తూ గౌరవంగా ఇంటి నుంచి పంపేయాలి. అనంతరం తడిబట్టతో పూజా ప్రాంగణం శుభ్రం చేయాలి. దీపావళి రోజున దీపాల వెలగించడమే సంప్రదాయం.