Today Telugu News Updates
తన ఆస్తి మొత్తాన్ని కుక్క పేరు మీద రాసిన యజమాని….కారణం ఏంటి !

ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. చింద్వారా జిల్లాలోని బరిబాడా గ్రామానికి చెందిన ఓం నారాయణ్ అనే రైతు తన భార్య, అయిదుగురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే తాను ఒక కుక్కను కూడా పెంచుకుంటున్నాడు.
నారాయణ్‌కు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ అతని ఉన్న చెడు అలవాట్లను మానుకోమ్మని ఎన్ని సార్లు మందలించిన మారకపోవడంతో విసుగు వచ్చి నారాయణ్ కు ఉన్న ఆస్తిలో తన భార్య చంపా, పెంపుడు కుక్క జాకీ లకు ఆస్తులను రాసిచ్చాడు.
నారాయణ్ కి ఉన్న 18 ఎకరాల్లో కుక్కకి 2 ఎకరాలు, తన భార్య చంపా కి మిగిలిన భూమిని రాసిచ్చి తన కొడుకుపై ఉన్న కోపాన్నిఈ విదంగా తీర్చుకున్నాడు .