health tips in telugu
Garlic: ఒక్క వెల్లుల్లి.. అనేక లాభాలు
Health Benefits of Garlic: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. అయితే ఉల్లే కాదు వెల్లుల్లి వల్ల కూడా మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
వెల్లుల్లిలో యాంకీబాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లిలో రోగనిరోధక శక్తి, అకాల వృద్ధాప్య నివారణ తత్వాలతో పాటు, రక్తనాళాల నష్టం వంటి సమస్యల నుంచి కాపాడే పోషకతత్వాలు ఇందులో ఉన్నాయి.

గుండె జబ్బు, ఆస్టియోఆర్థరైటిస్ వంటి ప్రమాదాల్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాకుండా జీర్ణశక్తి మెరుగుపడి.. ఆకలి పుడుతుంది.
వెల్లుల్లి అడ్రినలిన్‌ను అధికంగా విడుదల చేసి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఇందులో సల్ఫర్‌తో పాటు, అల్లిసిన్ అనే సమ్మెళనం కూడా ఉంటుంది.