Today Telugu News Updates

వరంగల్ నడిబొడ్డున రెచ్చిపోయిన సైకో శంకర్ !

Psycho Shankar in the middle of Warangal

వరంగల్  జిల్లాలోని కరీమాబాద్‌కు చెందిన శంకర్.. వ్యక్తిగత కక్షల కారణంగా తన మేన కోడలితో పాటు, ఆమె స్నేహితుల ఫోటోలను  అసభ్యంగా మార్చుతూ  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ ఫోటోలను గుర్తించిన బాధితులు శంకర్ ని మందలించారు. ఐనకాని తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో  మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆ సైకో ఆగడాలు ఇంకా ఎక్కువ కావడంతో పాటు ఫోటోలను  మార్ఫింగ్ చేసి వాట్సప్ స్టేటస్, ఫేస్‌బుక్ ‌లలో అసభ్య పదజాలాలతో  ప్రచారం చేశాడు.

ఇలా చేయడం వల్ల  బాధితురాలి పెళ్లికి అడ్డుపడాలని చూస్తున్నాడని  బాధితులు పోలీసులకు తెలిపారు.  ఆ సైకో శంకర్ నుండి తమను ఎలాగైనా కాపాడాలని ఆలా కాపాడకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదన వెల్లడించారు. పోలీసులు శంకర్ ని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button