Punjab Lottery: రాత్రికి రాత్రే కోటీశ్వరాలుగా మరీనా మహిళా…!

Punjab Housewife Wins ₹ 1 Crore Lottery: చిన్న వ్యాపారం చేసుకొనే కుటుంబానికి చెందిన ఒక మహిళా జీవితం రాత్రికిరాత్రే మారిపోయింది. కేవలం ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి లాటరీకొన్నందుకు జీవితం మారుతుందని తాను కూడా ఉహించి ఉండదు. ఆమె కొన్న టిక్కెట్ కి ఏకంగా కోటి రూపాయలు తగిలాయి. ఈ విషయం తెలిసిన మహిళా కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది.
దీనికి సంబదించిన వివరాలిలా..ఉన్నాయ్. .. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌కి చెందిన రేణూ చౌహాన్ కేవలం 100 రూపాయలు పెట్టి ప్రభుత్వానికి చెందిన ఓ లాటరీ టికెట్‌ను కొన్నది. ఆ లాటరీకి సంబంధించిన డ్రాను అధికారులు ఫిబ్రవరి 11న తీయడంతో ఆ డ్రాలో రేణూ కొన్న లాటరీ టికెట్ D-12228కు మొదటి బహుమతి ని సొంతం చేసుకుంది. ఇంకేముంది ఆ వచ్చిన డబ్బులు పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్ అదికారులకు అందించి ఆ డబ్బులను పొందనుండి.
లాటరీ డాక్యుమెంట్లను సమర్పించిన అనంతరం రేణూ చౌహాన్ తన సంతోషాన్ని ఇలా వ్యక్తం చేసింది. ఆ దేవుని దీవెనలు తన పై ఉన్నందువల్లే ఇలా లాటరీ తగిలిందని తెలిపారు. ఈ డబ్బుల ద్వారా తనకున్న చిన్న చిన్న అప్పులు తీర్చుకొని మిగితావి వారి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకుంటామని తెలిపారు.