Tollywood news in telugu
మాస్కు పెట్టుకొని, నిరాడంబరంగా అనుష్క ప్రయాణం !

టాలివుడ్ హీరోయిన్ అనుష్క పశ్చిమ గోదావరి పోలవరం మధ్యలో గల మహా నందీశ్వర స్వామి గుడికి వెళ్లారు. తన స్నేహితులతో కలిసి ఆమె పడవలో ప్రయాణించి ఆ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. అనుష్క కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతితో కలిసి పూజలు జరిపారు . కానీ అక్కడి ప్రజలు అనుష్క చాల సింపుల్ గా ఉండడంతో అదేవిదనగా ఆ సమయంలో మాస్కు ధరించడంతో ఎవరూ ఆమెను గుర్తు పట్టలేకపోయారు.
గతంలో అనుష్క తిరుపతి దేవాలయానికి పలుమార్లు వచ్చారు. అపుడే అనుష్కకు దైవభక్తి కాస్త ఎక్కువగానే ఉందని అనుకున్నారు ప్రజలు. ఇక సినిమా విషయాలకు వస్తే అనుష్క ఇటీవల నిశ్శబ్దం సినిమాలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు అనుష్క మరే కొత్త ప్రాజెక్టు గురించి ఏమి ప్రకటించలేదు.