Today Telugu News Updates
ప్రాణం కంటే పరువే ముఖ్యం అందుకే చనిపోతున్న …!
తాను చనిపోతున్నాను అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.

వరంగల్ కి చెందిన రమేష్ అనే వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలకు గాను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళింట్లో నగలు పోయాయని అవి రమేష్ దొంగిలించాడని వాళ్ళ ఫ్రెండ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమేష్ ను పోలీసులు మందలించారు. దీంతో రమేష్ తీవ్ర మనస్థాపానికి గురై…”చేయని నేరానికి నా జీవితం బలి అవుతుంది. ప్రాణం కంటే పరువు ముఖ్యం” అని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అయితే రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.