Tollywood news in telugu
ragini dwivedi : డ్రగ్స్ కేసులో ఊరటపొందిన నటి !

ragini dwivedi : గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం అందరికి తెలిసిన విషయమే, ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాగిణికి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి.
అదేవిదంగా చిత్రపరిశ్రమలో చాలా మందికి మాదకద్రవ్యాలను సరాఫరా చేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది సెప్టెంబర్ లో నటీమణులు రాగిణి, సంజనాను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని నటి రాగిణి బెయిల్ కోరగా దానికి కర్ణాటక హైకోర్టు అంగీకరించలేదు.
అటుపిమ్మట రాగిణి బెయిల్ కోసం సుప్రీంకోర్టు కు వెళ్ళింది. తన అభ్యర్థనను మన్నించి ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.