bigg boss 4 telugu : ఈ ఇద్దరు ఒకే … మిగిలినవాళ్లను ఎలిమినేట్ చేయండి: రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు వారాలు మిగిలి ఉండటంతో బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై ప్రజలందరూ ఎంతో ఉత్కంఠముగా ఎదురుచూస్తున్నారు . ఈ సీజన్‌లో మొత్తం 19 కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పన్నెండో వారం ముగిసేసరికి ఏడుగురు మాత్రమే ఉన్నారు . ప్రస్తుతం అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్, హారిక, సోహైల్, మోనాల్‌లు టైటిల్ గెలుచుకోడానికి కష్టపడుతున్నారు .
వీలంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఇందులో ఎవరు టాప్ 5లో నిలబడుతారన్నదానిపై ప్రజలలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘టికెట్ టూ ఫినాలే’ టాస్క్ ద్వారా అఖిల్ టాప్ 5కు చేరుకున్న విషయం తెలిసిందే.
కొందరు సీరియల్ నటీనటులు అఖిల్‌కు మద్దతు ప్రకటించగా.. నటుడు సాయి కుమార్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్‌కు సపోర్ట్ చేయమని ప్రేక్షకులను కోరాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబుతో సహా పలువురు నటులు అభిజిత్ సీజన్ 4 విజేతగా గెలుస్తాడని అన్నారు . అటు యూట్యూబ్ స్టార్లు మాత్రం దేత్తడి హారికకు సపోర్ట్ చేయాలనీ కోరారు .
సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. తాజాగా సోహైల్, అరియనాలు టాప్ 2లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. జెన్యూన్‌గా ఆడేవాళ్లకు వెన్నుదన్నుల నిలవాలని ప్రేక్షకులను కోరాడు. సరిగా ఆడనివారిని ఎలిమినేట్ చేయండంటూ అభిమానులను కోరాడు.