Tollywood news in telugu
రజనీకాంత్ సై అంటే నేను సీఎం రేసులో నిలబడతా !

తమిళ స్టార్ రజనీకాంత్ పార్టీ స్థాపించినప్పటికీ సీఎం బరిలో ఉండనని ఇంతకుముందే స్పష్టం చేసాడు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రజనీకాంత్ సై అంటే సీఎం రేసులో ఉండటానికి నేను రెడీ అని నటుడు కమల్ హసన్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించారు.
ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో డబ్బులు పంచేందుకు ఆసక్తి చూపేవి ప్రజల సమస్యలను ఎందుకు పటించుకోవడం లేదని విమర్శించారు. ఇలా డబ్బులు పంచె పార్టీలని నమ్మకండి అని కమల్ ప్రజలకు తెలిపాడు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు సమస్యలను పరిష్కరించే ప్రభుత్వాలు కావాలని , ఇలా డబ్బులు పంచేవి కావని తెలియజేసాడు.
ఇప్పటికే ఇక్కడి ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి డబ్బులు ఇస్తుందని, అవి వారికీ ఏమాత్రం సరిపొవట్లేదని , వారి కనీస అవసరాలను కూడా తీర్చడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.