rajireddy telugu traveller : తక్కువ ఖర్చుతో దేశ,విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా…. ఐతే ఇది మీకోసమే….!
rajireddy telugu traveller : భూమిమీద పుట్టిన ప్రతిఒక్కరికి దేశవిదేశాల చుట్టిరావాలని ఒక కళ ఉంటుంది. ఆ కళ ను కొంతమందికె సాధ్యం అవుతుంది అని అనుకుంటారు చాల మంది. కానీ ఇక్కడ దేశవిదేశాల ఎవరైనా చుట్టిరావచ్చు అంటున్నాడు ప్రముఖ యూట్యూబర్ రాజిరెడ్డి .

హైదరాబాద్ మేడ్చెల్ కి చెందిన రాజిరెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఒక కంపనీలో జాబ్ చేస్తూ, శని,ఆది వారాల్లో ట్రావెల్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
తన జాబ్ చేస్తూనే ఇంకేదో చేయాలి అనే తపన అతనిలో ఉండేది. ఆ తపనలోనే పుట్టింది ‘తెలుగు ట్రావెలర్ ‘ యూట్యూబ్ ఛానల్. రాజిరెడ్డి మొట్టమొదటిసారిగా.. 2014 లో గోవా వెళ్లి తన కెమెరాలో బంధించిన వ్యూస్ ని ఛానల్ లో అప్ లోడ్ చేసాడు. అపుడు అతడు ఇంగ్లీషులో కంటెంట్ ని ఇచ్చాడు. కానీ అది ప్రజలకు అంతగా రీచ్ కాలేదు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత 2017 లో తెలుగులో కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు, అప్పటినుండి ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ యూట్యూబర్ గా కొనసాగుతున్నాడు.

తాను చేస్తున్న జాబ్ వానికి 5 రోజులు ఉండటంతో మిగిలిన 2 రోజులు ట్రావెల్ కు కేటాయిస్తూ, అతి తక్కువ ఖర్చుతో , ట్రావెల్ ఏజెన్సీ అవసరం లేకుండా ఎలా వెళ్ళాలి. ఎక్కడ ఉండాలి. ఎక్కడ సేఫ్టీ ఉంటుంది. ఫ్యామిలీ తో ఎక్కడెక్కడికి వెళ్లొచ్చు, అనే అతి ముఖ్యమైన సమాచారాన్ని తన సబ్ స్కైబర్స్ కి ఎంతో స్పష్టంగా వివరిస్తూ , ముందుకు వెళ్తున్నాడు.
రాజిరెడ్డి ఇప్పటివరకు ఇండియాలోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటుగా, థాయిలాండ్,రష్యా,వియాత్నం, కజికిస్థాన్, మలేషియా, మాల్దీవ్స్, దుబాయ్, వంటి ప్రదేశాలకు వెళ్లివచ్చి ప్రజలకి కూర్చున్నచోట ముఖ్య సమాచారాన్ని , అలాగే ప్రపంచాన్ని చూపించాడు.

రాజిరెడ్డి ఇచ్చే కంటెంట్ అందరికి ఉపయోగకరంగా ఉండటంతో , ఇప్పటివరకు అతని ఛానెల్ 4 లక్షల సబ్ స్కైబర్స్ కి చేరువలో ఉంది. ఇంకా ఇలాంటి విలువైన సమాచారాన్ని ప్రపంచ దేశాలు అన్ని తిరిగి అందిస్తాడని ఆశిద్దాం.