Tollywood news in telugu

Ram with Mass Director : ఎనర్జిటిక్ స్టార్ తో బోయపాటి శ్రీను :-

Ram with Mass Director

Ram with Mass Director : ఎపుడు లవర్ బాయ్ పాత్రలతో కొంచెం మాస్ ఫైట్స్ పెట్టి సినిమాలు తీసే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మొట్టమొదటి సారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ తీయడానికి సిద్దమయిపోయాడు.

ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వం లో, కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ్ మరియు తెలుగు లో చిత్రీకరించి సినిమాని విడుదల చేసి పనిలో నిమగ్నమయ్యారు. ఈ సినిమా పూర్తి అయ్యాక బోయపాటి దర్శకత్వం లో నటించబోతున్నారు.

అయితే బోయపాటి ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉన్నారు . ఈ చిత్రం దసరా కి విడుదల అవ్వబోతుంది. అయితే బోయపాటి ఇదివరకే రామ్ కి కథ చెప్పారని, ఆ కథ రామ్ కి నచ్చడం తో ఇన్ని నెలల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని అర్ధం అయింది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి మరియు శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారు.

ఈ సినిమా కూడా తెలుగు మరియు తమిళ్ లో ఒకేసారి చిత్రీకరించనున్నారు. ఈ కాంబినేషన్ ఎవరు ఊహించనిది. రామ్ బోయపాటి దర్శకత్వం లో ,మాస్ లుక్ లో ఏ విధంగా ఉండబోతున్నాడని ఇప్పటినుంచే ఊహలు మొదలుపెట్టేశారు అభిమానులు. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button