రాంగోపాల్ వర్మ ఆఫిస్ ముందు ధర్నా ..!

ramgopal varma గత సంవత్సరం నవంబర్ 26 న దిశ పై నలుగురు వక్తులు చేసిన హత్యాచారం ఆధారంగా చేసుకొని వర్మ సినిమాని తెర మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
కాంట్రవర్సీ నీ జేబులో పెట్టుకొని సినిమాలు ట్వీట్లు చేస్తూ డబ్బులతో పాటు మరొకరి బాధని సినిమా రూపంలో చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్న వర్మ దిశ కేసు పైన పడ్డాడు.
ఈ విషయానికి సంబంధించి వర్మ దిశ సంఘటనకు సంబదించిన వ్యక్తి కేశవులు భార్యని అలాగే దిశ కేసును టెక్అప్ చేసిన పోలీసులను కలిసి వీరి దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని వర్మ సినిమాని చిత్రీకరించాడు.
అయితే ఈ సినిమాకి వ్యతిరేకంగా దిశా తండ్రి పోరాడుతున్నాడు. తాజాగా వర్మ రిలీజ్ చేసిన ‘దిశ ఎంకౌంటర్ ‘ ట్రైలర్ ని చుసిన దిశ తండ్రి ఆనాటి సంఘటనను గుర్తుచేసే విదంగా ఉండడంతో ఆగ్రహానికి గురి ఐ ఈ సినిమాని ఆపేయాలని సెన్సార్ బోర్డు ని కోరాడు.
అదేవిదంగా కోర్టుని కూడా ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన పిటిషన్ ని పి . నవీన్ రావు విచారించారు. దిశ సంబదించిన కేసు ఇంకా విచారణ జరుగుతున్నపుడు ఇలా సినిమాలు చేయడం సరికాదని దిశ తండ్రి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపాడు.
అలాగే దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఫ్యామిలి మెంబెర్స్, వర్మ ఆఫిస్ ముందు ధర్నాకు దిగాడు. వర్మ దీనికి సంబంధించి మాట్లాడుతూ చట్టానికి న్యాయానికి లోబడి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మల్లి ఇంకెవ్వరు చేయకుండా ఉండేవిదంగా ఈ సినిమా ఉంటుందని తనను తాను సమర్ధించుకుంటున్నాడు.
ఇప్పటికీ ఎన్నో సినిమాలు కంటవర్సీ తెచ్చిన వాటిని అడ్డుకొలేకపోయారు , మరి ఈ దిశ సినిమా కి అదే గతి పట్టానుందా? లేదా ‘దిశ ఎంకౌంటర్ ‘ అడ్డుకొని రాంగోపాల్ వర్మ సినిమాకి చెక్ పెట్టే మొదటి అవకాశం ఉంటుందా చూడాలి.