Rana and Sharwanand Multi Starrer Film : రానా తో శర్వానంద్ మల్టీస్టారర్ షురూ ?:-

Rana and Sharwanand Multi Starrer Film : మల్టీస్టారర్ సినిమాల పైనే ఈ మధ్య స్టార్ హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇపుడు వచ్చే సినిమాలలో ఎక్కువ శాతం మల్టీస్టారర్ ఏ.
ముందుగా రానా దగ్గుపాటి , ఈయన స్క్రిప్ట్ సెలక్షన్ కి కేర్ అఫ్ అడ్రస్. ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఆ సినిమాలో కథ ఎంతో బలంగా ఉండాలి. ప్రస్తుతం అయన చేసే సినిమాలు విరాట పర్వము , వెంకీ మామ తో రానా నాయుడు , పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్. ఇలా రానా చేసే 3 సినిమాలలో రెండు ముల్టీస్టారర్ ఏ. ఒక సినిమా కి ఇంకో సినిమా కి అసలు సంబంధం ఉండదు. అంతలా స్క్రిప్ట్ పైన జాగ్రత్తలు తీసుకుంటారు రానా.
ఇదిలా ఉండగా శర్వానంద్ , ఈయన స్టైల్ ఏ సెపెరేట్. సినిమా హిట్ , ప్లాప్ తో సంబంధం లేదు. కథ నచ్చిందా ఎంత దూరం అయినా వెళ్తారు. అయన నమ్ముకున్న కథలు ప్లాప్ అయినా ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలాంటి శర్వానంద్ ప్రస్తుతం సిద్ధార్థ్ తో మహా సముద్రం అనే మల్టీస్టారర్ సినిమా చేసారు. ఇది అక్టోబర్ లో విడుదల కాబోతుంది. దీనితో పాటు ఆడవారు మీకు జోహార్లు అనే డిఫరెంట్ సినిమా చేస్తున్నారు.
అయితే మొట్టమొదటి సారి ఆన్ స్క్రీన్ లో ఈ ఇద్దరు హీరోలు కనిపిస్తే ఎలా ఉంటుంది. రచ్చహా రచ్చస రచ్చొబ్యహా.
త్వరలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో శర్వానంద్ మరియు రానా కలిసి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి కొత్త దర్శకుడు , దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చూడాలి మరి శర్వానంద్ మరియు రానా కలిసి ఏ రేంజ్ లో రచ్చ చేయబోతున్నారో.