Viral news in telugu
తన ఆరోగ్య పరిస్థితి పై మరోసారి గొంతువిప్పిన రానా !

టాలీవుడ్ హీరో రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని ఒక న్యూస్ బయటికి వచ్చింది. ఈ విషయంపై రానా కానీ తన ఫ్యామిలీ కానీ ఎలాంటి విషయం బయటపెట్టలేదు.
ఈ మధ్య శామ్ జామ్ షో లో రానా తన ఆరోగ్య విషయం పై క్లారిటీ ఇచ్చాడు. అరణ్య సినిమా ప్రిపరేషన్ లో కంటికి లాసిక్ సర్జరీ చేసుకోవాలని అనుకున్నాను. అప్పటివరకు ఒక లెన్స్ అవసరం ఉండేదని తెలిపాడు.
తనకి పరీక్షలు చేయగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బిపి ఉందని వెల్లడించారు. అమెరికాకు వెళ్లి టెస్ట్ లు చేయించుకుంటే లైఫ్ కి రిస్క్ ఉందని చెప్పారు.
అప్పటినుండి ఉప్పులేని ఆహారాన్ని తీసుకుంటున్నానని, మనం ఎదుగుతూ ఉంటె తల్లిదండ్రులకు దూరం అవుతూ ఉంటాం, కానీ నేను మాత్రం ఇపుడు దగ్గరవుతున్న అని తెలిపాడు.