Rap rock shakeel – టాలీవుడ్ మ్యూజిక్ రంగంలోకి మరో ఆణిముత్యం

Rap rock shakeel – మంచి బజ్ తో అక్టోబర్ 29 న రిలీజ్ ఐన మిషన్ 2020 కి సంగీతాన్ని అందిచాడు , ఈ సినిమా మంచి బజ్ రావటానికి ముఖ్యమైన కారణాల్లో రాప్ రాక్ షకీల్ మ్యూజిక్, ‘Alluda Garelu Vandala’ అనే సాంగ్ జనాల్లో ఇప్పటికే జనాల్లో నానుతూ ఉంది, త్వరలో డైరెక్టర్ ‘సముద్ర’ కుడా తన తర్వాత సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా రాప్ రాక్ షకీల్ అని ఆడియో రిలీజ్ లోనే ప్రకటించాడు, ఈ సినిమా ఆడియో రిలీజ్ కి భరద్వాజ్ లాంటి కొందరు సినీ పెద్దలు, బ్రదర్ షఫీ కుడా పాల్గొన్నారు .
రాప్ రాక్ షకీల్ అంతక ముందు గా రణం 2 అనే సినిమాకి నేపధ్య సంగీతం అందిచాడు , అలా మొదలైన ప్రస్తానం మిషన్ 2020 వరకు సక్సెస్ ఫుల్ గా సంగీతాన్ని అందించాడు . చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కి వరం లా దొరికాడు . ఇప్పుడు తన పాటలు విపరీతంగా ప్రేక్షకులని అలరించడం తో పెద్ద పెద్ద సినిమా టీమ్స్ రాప్ రాక్ షకీల్ నీ వారి సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలని ఆఫర్స్ కూడా రావడం జరుగుతుంది. త్వరలో ఎవ్వరూ ఊహించని పెద్ద సినిమా తో రాబోతున్నారు, త్వరలో వీటి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ డైరెక్షన్ లో రిలీజ్ ఐన సినిమాలు
- 2017 – Chinni Chinni Asalu Nalo Regene
- 2018 – రా రా (2018 చిత్రం)
- 2019 – ఆపరేషన్
- 2019 – Manasantha Nuvve,
- 2021 – మిషన్ 2020
- TBA – Gandharva
- TBA – Darza
వీటితోపాటు రాప్ రాక్ షకీల్ చేయబోతున్న సినిమాలో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గంధర్వ ( జార్జ్ రెడ్డి హీరో సందీప్ ) , దర్జా ( అనసూయ , సునీల్ ) . వీటితో పాటు రాప్ రాక్ షకీల్ యొక్క పనితీరు తెలుగు లోనే కాదు ఇతర భాషల దర్శక నిర్మాతలకు నచ్చి వారి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయమని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది.
అతి తక్కువ సమయం లో ఇంతటి స్థాయికి రావడం రాప్ రాక్ షకీల్ యొక్క కృషి , పట్టుదల. వీటన్నిటి మధ్య రాప్ రాక్ షకీల్ తో పని చేసిన దర్శక నిర్మాతలు ఈ విధంగా చెప్పారు ” దేవీశ్రీ ప్రసాద్ , తమన్ , మణిశర్మ తర్వాత ఆ స్థాయి లో మ్యూజిక్ కొట్టగలిగే డైరెక్టర్ రాప్ రాక్ షకీల్ అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. “
అలాగే Social Awareness Song కరోనా పైన పాడిన పాట మంచి పేరు తెచ్చింది

మిషన్ 2020 డైరెక్టర్ కరణం బాబ్జి , హీరో నవీన్ చంద్ర అలాగే రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ ఈ ముగ్గురి కలయికలో ఒక యంగ్ టీం గా మిషన్ 2020 బరిలోకి ఈరోజు దిగనుంది , ఈ సినిమాలో శ్రీ రపాక ఐటమ్ సాంగ్ లో కనువిందు చేసింది , ‘అల్లుడు గారెలు’ అనే సాంగ్ లో మెరిసిపోయింది .