Tollywood news in telugu

రవితేజ రావణాసుర మూవీ విడుదల తేది ఫిక్స్ :- Ravanasura Movie Release Date Locked :-

Ravanasura Movie Release Date Locked

మాస్ మహరాజ్ రవితేజ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన చేయబోయే సినిమాలలో ఎక్కువ హైప్ తెచ్చిపెట్టిన సినిమా రావణాసుర. ఈ సినిమా ఇంకా షూటింగ్ ఏ మొదలు పెట్టలేదు కానీ అభిమానుల్లో మరియు సగటు సినీ ప్రేమికులకు ఎంతగానో ఆశక్తి రేపారు. దీనికి గల కారణం కొన్ని నెలల క్రితం విడుదల చేసిన సినిమా పోస్టర్ ఎ.

ఇప్పటివరకు విడుదలైన సినిమా పోస్టర్స్ లో ఈ రావణాసుర పోస్టర్ మాత్రం చాలా స్పెషల్ మరియు అందరిని ఓ రేంజ్ లో అలరించింది. అయితే మ్యాటర్ లోకి వెళ్తే.

ఈరోజు రవితేజ రావణాసుర సినిమాకి సంబందించిన పూజ కార్యక్రమాలు జరిగాయి. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమా పైన రవితేజ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థం అయింది.

ఈ సినిమా కి సంబందించిన పోస్టర్ విడుదల చేయగా దానితోపాటు విడుదల తేది కూడా ఖరారు చేశారు. రవితేజ మరియు సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చే రావణాసుర సినిమా సెప్టెంబర్ 30 న థియేటర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని అధికారిక ప్రకటన చేశారు.

ఈ సినిమాలో సుశాంత్ ముఖ్యమైన పాత్ర చేయబోతున్నారు అని తెలిపారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button